కేంద్ర బడ్జెట్ వేడి షురూ: షెడ్యూల్ ఇదే: భారీ ఎత్తున ఎన్నికల తాయిళాలు

Union Budget 2024: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. వచ్చే రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Budget 2024: FM Nirmala Sitharaman will present the interim budget on Feb 1

ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతోన్నాయి. దీనికి సంబంధించిన తేదీలు వెలువడ్డాయి. జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభమౌతాయి. అదే రోజున ఉభయ సభలు సమావేశమౌతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. ఇది మధ్యంతర బడ్జెట్. లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున ఆమె మధ్యంతర బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు.

ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2024 బడ్జెట్‌లో భారీగా తాయిలాలను ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. సంక్షేమ పథకాల కేటాయింపులను రెట్టింపు చేయొచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+