Budget 2024:గతేడాది ఈ రంగాలకు ప్రధాన కేటాయింపులు..మరి ఈ సారి..?
సాధారణ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్న దృష్ట్యా పూర్తిస్థాయిలో బడ్జెట్ ఉండదు. ఇక 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ జూలైలో అప్పుడు వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇక భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏటా ఏప్రిల్ 1న ప్రారంభమై ఆ తర్వాతి సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది బడ్జెట్‌లో ఐదు ప్రధాన ప్రకటనలు ఏంటనేది చూద్దాం.
ఆదాయపు పన్ను:
పాత ఆదాయపు పన్ను వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కొత్త పన్ను వ్యవస్థలో మాత్రం రివైజ్ చేసిన టాక్స్ శ్లాబ్స్‌ను చేర్చారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఆదాయపు పన్ను మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కొత్త ఆదాయపు పన్నులో పెంచారు.ఇక టాక్స్ రిబేట్‌ను రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.ఇక పాత టాక్స్ సిస్టంలో రూ.50వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంకు కూడా అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.

మూలధన ఖర్చు పెంపు:
ఇక పెట్టుబడుల విషయంలో మూలధన పెట్టుబడులను వరుసగా మూడో ఏడాది కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 33శాతం మేరా పెంచి రూ.10 లక్షల కోట్లకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచారు. మొత్తం జీడీపీలో ఇది 3.3శాతంగా ఉంది.
విద్య వైద్యం:
విద్య వైద్య రంగాలకు రూ.89,155 కోట్లను కేటాయించడం జరిగింది. అంతేకాదు 2047 నాటికి భారత ప్రజలను పట్టిపీడిస్తోన్న రక్తహీనత సమస్యను అంతమొందిస్తామనే ప్రకటన చేశారు నిర్మలమ్మ.అంతేకాదు నూతనంగా 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది 2014 నుంచి ఇప్పటి వరకున్న 157 మెడికల్ కాలేజీలకు అదనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన:
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులను 65శాతం మేరా పెంచి దాన్ని రూ.79వేల కోట్లు కేటాయించారు.అంతకుముందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించడం జరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు యువ పారిశ్రామికవేత్తలను కేంద్రం ప్రోత్సహించింది.ఇందుకోసం వ్యవసాయానికి వేగంగా ఊతమిచ్చేలా ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. పశుపక్ష్యాదులు, పాల ఉత్పత్తి రంగం, మత్స్యశాఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కొత్తగా ఉప పథకాన్ని జోడిస్తూ మత్స్యకారులు, చేపల విక్రేతలు మరియు MSMEల (సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు) కార్యకలాపాలను సరళతరం చేసేందుకు రూ.6వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు.
ఇక ఈ సారి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇటు ఉద్యోగస్తులు, అటు మధ్యతరగతి కుటుంబాలు ఆశలు మొత్తం నిర్మలమ్మ పైనే ఉన్నాయి. అయితే ఆర్థికశాఖ మంత్రి కనికరిస్తుందో లేక కఠినంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications