తలాక్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నా: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేయడం వంటి కీలకమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

Budget Session 2018 LIVE updates: president ramnath kovind arrives at Parliament, modi says budget will fulfill everyone's aspirations

కార్మికుల కనీస వేతనాలను 40 శాతానికి ఎన్ డి ఏ ప్రభుత్వం పెంచిందని రాష్ట్రపతి గుర్తు చేశారు.

బుల్లెట్ రైలు పనులు వేగంగా సాగుతున్నాయని రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ చెప్పారు.

సృజనాత్మక నగరంగా చెన్నైకు యునెస్కో అవార్డు దక్కిందని రాష్ట్రపతి చెప్పారు.

విద్యుత్ రంగంలో ఎంతో పురోగతిని సాధించినట్టు చెప్పారు. ఒకే దేశం ఓకే గ్రిడ్ లక్ష్యంగా పనిచేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.

డిజిటల్ చెల్లింపులో బీమ్ యాప్ కీలకంగా పనిచేస్తోందని రాష్ట్రపతి చెప్పారు.

ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా 3 కోట్ల మంది ప్రయోజనం పొందారని రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ చెప్పారు.

పేదలకు అందుబాటులో 800 రకాల మందులు వచ్చాయని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు.

అటల్ ఇన్నోవేషన్ ద్వారా అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి చెప్పారు.

పౌరవిమానయానశాఖను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రాష్ట్రపతి గుర్తు చేశారు.

క్రీడల అభివృద్దికి ఖేలో ఇండియా పథకం ద్వారా రూ1750 కోట్లను కేటాయించినట్టు రాష్ట్రపతి ప్రకటించారు.

బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి చెప్పారు.

బాలికల సంరక్షణ కోసం బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు రాష్ట్రపతి గుర్తు చేశారు.

కొత్తగా 4 కోట్ల మందికి విద్యుత్ సౌకరర్యాన్ని కల్పించినట్టు రాష్ట్రపతి ప్రస్తావించారు.

దేశంలో సుమారు 3 వేల జనఔషద కేంద్రాలను ప్రారంభించినట్టు రాష్ట్రపతి చెప్పారు.

స్వచ్చ భారత్ దిశగా ముందడుగు వేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.
2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్ళను నిర్మించనున్నట్టు రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ప్రకటించారు.

2018లో దేశ స్వప్నాలను సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

2018 నవ భారత నిర్మాణానికి నాంది పలకబోతోందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చెప్పారు.

బ్యాంకు సేవలు పేదలకు మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి సూచించారు.

ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకే తలాక్ బిల్లు ప్రవేశపెట్టినట్టు రాష్ట్రపతి చెప్పారు.

పేదలు, ఉన్నత వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు.

స్వయం సహయక గ్రూపులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి కోవింద్ అభిప్రాయపడ్డారు.
రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు.

ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అవుతోందని ఆశాభావాన్ని రాష్ట్రపతి కోవింద్ వ్యక్తం చేశారు.

సాగునీటి పారుదల వ్యవస్థను విస్తరించి రైతులకు చేయూతనివ్వాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని కోరారు.

ప్రధానమంత్రి కిసాన్ యోజనం పథకం రైతులకు ప్రయోజనంగా ఉంటుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

బీమా పేదలకు అండగా ఉంటుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
2 లక్షల గ్రామాలు బ్రాడ్ బ్యాండ్‌తో అనుసంధామనమ్యాయని రాష్ట్రపతి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+