లోయలో పడిన బస్సు: ముగ్గురు జవాన్లు మృతి, 32 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరిహద్దు భద్రతా దళం(BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సులో భారీ లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 32 మంది గాయాలపాయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్ కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయల్దేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసులు తెలిపారు. 32 మంది గాయాలపాలయ్యారని చెప్పారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Three Border Security Force (#BSF) personnel were killed and 32 others injured on Friday after a bus carrying them skidded off a hilly road and plunged into a gorge in the #Budgam district of #Jammu and Kashmir, officials said.#busaccident #accident pic.twitter.com/iGkZNuiotB
— Madhuri Adnal (@madhuriadnal) September 20, 2024
కాగా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న జరగనుంది. ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతా దళాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, ఉగ్రవాదుల వేట కూడా కొనసాగిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications