ఆ గ్రామాలకు తొలిసారిగా బస్ సర్వీస్- తెలంగాణ సరిహద్దుల్లో..!!

Chhattisgarh encounter: దేశంలో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంటుంది.. ఛత్తీస్‌గఢ్. ఇక్కడ విస్తరించిన దండకారణ్యాన్ని కేంద్రబిందువుగా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగిస్తూ వచ్చారు. వీటి ప్రభావం తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్రల్లోనూ కొనసాగిన సందర్భాలు లేకపోలేదు.

ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లు మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. భారీగా ప్రాణనష్టం మిగిల్చాయి. కిందటి నెల సంభవించిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి.

Bus service begins for Chhattisgarh-Telangana border village Pamed

ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, దండకారణ్యంలో విస్తరించిన అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌.. మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకం చేసినట్టయింది.

చివరి మూడు నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు నారాయణ్‌పూర్ సమీపంలోని అబూజ్‌మఢ్‌ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మారుమూల గ్రామాలకు తొలిసారిగా బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా కేంద్రం బిజాపూర్ నుంచి చిట్టచివరి గ్రామం పామెడ్‌కు తొలి బస్సు బయలుదేరి వెళ్లింది కూడా. మొత్తం ఏడు పంచాయతీల మీదుగా ఈ బస్సు రాకపోకలు సాగిస్తుంది.

Take a Poll

తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుందీ పామెడ్ గ్రామం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో సరిహద్దులను పంచుకుంటోంది. ప్రస్తుతం పామెడ్ సహా ఆయా గ్రామాలకు వెళ్లాలంటే తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. బిజాపూర్ నుంచి తెలంగాణ ద్వారా పామేడ్ చేరుకోవడానికి దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చేదని జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్రా చెప్పారు.

ఇప్పుడు మొదటిసారిగా బిజాపూర్ ప్రధాన కార్యాలయం నుండి నేరుగా పామెడ్ బస్ సర్వీస్ అందుబాటులో వచ్చిందని అన్నారు. అనేక గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యం లభించినట్టయిందని చెప్పారు. అవన్నీ కూడా జిల్లా కేంద్రంతో అనుసంధానం కావడం వల్ల అభివృద్ధికి నోచుకోగలుగుతాయని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+