మాజీ ప్రేయురాలి న్యూడ్ ఫొటోను నెట్‌లో పెట్టాడు: అరెస్ట్
ముంబై: తనను వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదనే కోపంతో తన మాజీ ప్రియురాలి నగ్న చిత్రాన్ని సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు జరిపి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
విపి రోడ్‌లోని సిక్కా నగర్‌కు చెందిన నిశ్చయ్ బన్సల్(24), బాధిత యువతి ఒకే పాఠశాలలో చదువుకున్నారు. దీంతో వారి పరిచయం వారితోపాటు పెరిగి ప్రేమగా మారింది. 2011లో బాధితురాలు తన ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో తన సెల్ఫీ ఫొటోలను తీసుకుంది. ఆ ఫొటోలను ఎవరితోనూ షేర్ చేయలేదు. కాగా, నిశ్చయ్ బన్సల్ ఆమెకు తెలియకుండా ఆ ఫొటోలను ఆమె సెల్‌ఫోన్ నుంచి తన సెల్ ఫోన్‌లోకి ఎక్కించాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ ఫొటోలను ఆమెకు చూపించాడు. దీంతో ఆమె వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేయాలని కోరింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాధిత యువతి అతనితో తన బంధాన్ని తెంచుకుంది. మళ్లీ తమ బంధాన్ని కొనసాగిద్దామని నిశ్చయ్ ఆమె వెంటపడ్డాడు. అయినా ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోను నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.
అంతేగాక, 2013, అక్టోబర్‌లో ఆమెకు వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న నిశ్చయ్ బన్సల్ ఆమెకు పలు బెదిరింపు మెసేజ్‌లు పంపించాడు. 2013, నవంబర్‌లో ఆమెకు కాబోయే భర్త వివరాలను తెలసుకున్న నిశ్చయ్.. అతనికి ఆమెకు సంబంధించిన ఫొటోలను చూపించాడు. ఆమెతో తనకు శరీరక సంబంధం ఉందని నిశ్చయ్ చెప్పడంతో ఆ పెళ్లి రద్దయింది. దీంతో బాధిత యువతి నిశ్చయ్ వేధింపుల గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితుడ్ని శనివారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications