నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

ముంబై: లైంగిక వాంచలు తీర్చుకోవడానికి వ్యాపారవేత్తలు భార్యలను మార్పిడి చేసుకుంటున్న వ్యవహారం దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో కలకలం రేపింది. తన భార్త బలవంతంగా రాత్రిపూట తన స్నేహితులతో సెక్స్ లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నాడని, ఆ సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని స్వయంగా వ్యాపారవేత్త భార్య పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు భాగోతం బయటపడింది. సినిమా ఫక్కీలో పోలీసులు పక్కాప్లాన్ వేసి భార్యను స్నేహితుడి పక్కలో పడుకోమని చెప్పిన వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

తెగ బలిసిన వ్యాపారవేత్త

తెగ బలిసిన వ్యాపారవేత్త

ముంబై నగరంలోని సమతానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త (46), అతని భార్య (39)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారవేత్త దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల పాటు వ్యాపారవేత్త భార్యతో కలిసి సంతోషంగా ఉన్నాడు. తరువాత అతని అసలు స్వరూపం బయటపెట్టాడు.

పరాయి స్త్రీల వ్యామోహం

పరాయి స్త్రీల వ్యామోహం

వ్యాపారవేత్తకు పరాయి స్త్రీల వ్యామోహం ఎక్కువ. సాటి వ్యాపారవేత్తలతో అమ్మాయిల విషయం, అతని భార్య పడకగదుల సుఖం విషయాల గురించి గంటలు గంటలు మాట్లాడేవాడు. అప్పుడే అతని మెదడులో చెడు ఆలోచనలు పుట్టాయి. మన భార్యలను మార్చుకుని ఎందుకు లైంగిక కోరికలు తీర్చుకోకూడదు ? అంటూ సాటి వ్యాపారవేత్తలతో చర్యలు మొదలు పెట్టాడు.

భార్యను ఫ్రెండ్ తో పడుకోబెట్టి !

భార్యను ఫ్రెండ్ తో పడుకోబెట్టి !

తన ఫ్రెండ్స్ కు లైంగిక కోరికలు తీర్చి నువ్వు కూడా వారితో ఎంజాయ్ చెయ్యాలని వ్యాపారవేత్త అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. 2017లో భార్యను బెదిరించి అతని స్నేహితుడి దగ్గరకు పంపించాడు. తరువాత తన భార్య ఎక్కడ ఆ విషయం కుటుంబ సభ్యులకు చెబుతుందో అనే భయంతో అతను రహస్యంగా వీడియోలు తీశాడు.

భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడు

భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడు

పర పురుషుడితో భార్య రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసిన వ్యాపారవేత్త వాటిని అడ్డం పెట్టుకుని భార్యను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. తాను చెప్పిన వ్యాపారవేత్తల దగ్గరకు వెళ్లి వారి లైంగిక కోరికలు తీర్చాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు.

భర్త వికృత కోర్కెలు

భర్త వికృత కోర్కెలు

భర్త వికృత కోర్కెలు తీర్చలేని భార్య చివరికి విసిగిపోయి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తన భర్త, అతని స్నేహితులు ఎలా భార్యల మార్పిడి చేసుకుంటున్నారు అనే విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు, బాధితురాలు వారి న్యాయవాది స్వప్నా కోడే కలిసి సమతానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో డీల్

సోషల్ మీడియాలో డీల్

వ్యాపారవేత్తలు వారి భార్యల మార్పడి కోసం వాట్సాప్, సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారని, గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యావహారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. భార్యను బలవంతంగా సాటి వ్యాపారవేత్తల దగ్గరకు పంపిస్తున్న వ్యాపారవేత్తను, భార్యల మార్పడి చేసుకుంటున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్తను కోర్టు ముందు హాజరుపరచగా ఈ నెల 23వ తేదీ వరకు అతని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని, భార్యల మార్పడి దందాలో ఇంకా ఎంత మంది అమాయక మహిళలు ఉన్నారో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+