Businessman: అక్క మొగుడి కొంప ముంచేసిన బావమరిది, అసలు మ్యాటర్ తో !
చెన్నై/సేలం: సొంతంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని అనుకున్నాడు. కట్టుకున్న భార్య సోదరుడిని వ్యాపార భాగస్వామిగా పెట్టుకున్నాడు. బావాబావమరిది కలిసి కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల బావాబావమరుదుల మద్య వ్యవహారం చెడింది. వెండి, బంగారు విక్రయించే షాపులో ఏకంగా 600 కేజీల వెండి, లక్షల నగదు, డాక్యూమెంట్లు మాయం అయ్యాయి, నా బావమరిది నా కొంప ముంచేశాడని బావ పోలీసులను ఆశ్రయించాడు.

అక్క మొగుడు
తమిళనాడులోని సేలంలో గుహ ప్రాంతంలో పన్నీర్ సెల్వం అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు, చాలా సంవత్సరాల నుంచి పన్నీర్ సెల్వం వెండి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న పన్నీర్ సెల్వం అతని వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని అనుకున్నాడు. పన్నీర్ సెల్వం అతని భార్య సోదరుడు సత్యనారాయణను వ్యాపార భాగస్వామిగా పెట్టుకున్నాడు.

వ్యవహారం చెడింది
చాలా సంవత్సరాల నుంచి బావాబావమరుడులు పన్నీర్ సెల్వం, సత్యనారాయణ వెండి, బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల బావాబావమరుదులు పన్నీర్ సెల్వం, సత్యానారాయణ మద్య వ్యవహారం చెడింది. బావ పన్నీర్ సెల్వం నుంచి విడిపోవాలని సత్యానాయణ డిసైడ్ అయ్యారు.

అక్క మొగుడి కొంప ముంచేసిన బావమరిది
సత్యానారాయణ, పన్నీర్ సెల్వం సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. నాలుగు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి తన షాపులో ఉన్న 615 కేజీల వెండి వస్తులు, రెండు లక్షల నగదు, విలువైన డాక్యూమెంట్లు చోరీ చేశారని పన్నీర్ సెల్వం శనివారం పోలీసు కేసు పెట్టాడు, తన బావమరిది సత్యానారయణ నా కొంప ముంచేశాడని పన్నీర్ సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications