రూ.13వేల కోట్ల ఆస్తి ప్రకటించాడు, నిబంధనల ప్రకారం బ్లాక్ మనీ అయింది: పరారీ, అనుమానాలు

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో అహ్మదాబాదులో ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టికి వచ్చిన ఓ కేసు సంచలనం రేకెత్తిస్తోంది.

అహ్మదాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో అహ్మదాబాదులో ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టికి వచ్చిన ఓ కేసు సంచలనం రేకెత్తిస్తోంది. తన వద్ద దాదాపు లెక్కలోకి రాని 13వేల కోట్ల రూపాయల నగదు ఉందని ఓ వ్యాపారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడిఎస్) కింద వెల్లడించాడు.

కానీ అందుకు సంబంధించిన టాక్స్‌ కట్టడంలో మాత్రం అతను విఫలమయ్యాడు. గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌ పట్టణానికి చెందిన మహేశ్‌ షా అనే వ్యాపారి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐడీఎస్‌ కింద తన వద్ద లెక్కలోకిరాని రూ.13 వేల కోట్లు ఉన్నాయని సెప్టెంబర్‌ 30న వెల్లడించాడు.

Businessman declares Rs 13,000 crore under disclosure scheme, fails to pay tax

అయితే ఇందుకు సంబంధించి నవంబర్‌ 30 లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద అతను రూ.975 కోట్లు చెల్లించాల్సి ఉంది. అతను దానిని చెల్లించడంలో విఫలమయ్యాడు. దాంతో నిబంధనల ప్రకారం అతడు ప్రకటించిన సొమ్మంతా నల్లధనం కిందకు వస్తుంది.

అందుకని అధికారులు వ్యాపారి అకౌంటెంట్‌ ఆఫీసు, అతని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ షా కొందరు బడా వ్యాపారవేత్తల తరఫున సదరు నల్లధనాన్ని ప్రకటించాడని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

అసలు ఆయన డబ్బేనా?

మహేష్ షాకు అప్పడప్పుడు సేవలందించే ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సేత్నా పలు విషయాలు మీడియాకు చెప్పారు. ఛార్టర్ట్‌ అకౌంటెంట్‌ సేవలందించే అప్పాజీ అమిన్‌ అండ్‌ కోలో ఈయన ఒక భాగస్వామి. ఆ సంస్థ ఆవరణల్లోనూ, మహేశ్‌ షా స్నేహితుల ఆవరణల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

గత నెల 29, 30, ఈ నెల 1న సోదాలు జరిగినట్లు సేత్నా చెప్పారు. ఆ తర్వాత మహేశ్‌ షా కనిపించడం లేదన్నారు. 2013 నుంచి మహేష్ షా తనకు తెలుసునని, రెగ్యులర్ క్లయింట్ కాదని, మనశ్శాంతి కావాలంటే ఐడీఎస్ కింద ఆదాయం వెల్లడించాలని సూచించానని, ఆ తర్వాత ఆయన వెల్లడించారని చెప్పారు.

షా ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదని తనకు తెలిసినా, ఆయనే స్వయంగా ప్రకటించడంతో తనకు అనుమానం రాలేదని, మహేష్ షా అంతమొత్తం వెల్లడించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదిలా ఉండగా, ఆయన ప్రకటించిన డబ్బు అతనిదేనా లేక ఇతరులదా? అధికారులదా? బడా నేతలదా? అనే చర్చ సాగుతోంది. సోదాలు జరుగుతుండగా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+