మహిళను విమానంలో వ్యాపారి ఎక్కడెక్కడో తాకాడు

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేష్ సింగ్ అనే నిందితుడిని ఆమె భర్త, తోటి ప్రయాణికులు, విమానం సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బ్రెజిల్‌లోని సావో పాలో నుంచి విమానం బయలుదేరిన వెంటనే ఆమె వెనక కూర్చున్న సింగ్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్త వచ్చాడు.
దాంతో అపకుండా అతను ఆమె ప్రైవేట్ భాగాలను తాకాడు. టాయిలెట్ వెళ్లి వస్తుండగా మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నిందితుడు తాగి కూడా లేడని సహార్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పాటిల్ చెప్పారు.
నిందితుడు, బాధితురాలు కూడా భారత జాతీయులే. రాజేష్ సింగ్‌ను బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టారు. అతన్ని కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం పనుల మీద రాజేష్ సింగ్ బ్రెజిల్ వెళ్లాడు.












Click it and Unblock the Notifications