రేప్ కేసులో బెటా చైర్మన్ అరెస్టు: ఉద్యోగినిపై అత్యాచారం, గర్బవతి, అబార్షన్ కోసం వెళ్లి !

తన దగ్గర ఉద్యోగం చేస్తున్న యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి గర్బవతిని చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, బెటా చైర్మన్ రాజమోహన్ పిళై (53)ను కేరళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

కొచ్చి: తన దగ్గర ఉద్యోగం చేస్తున్న యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి గర్బవతిని చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, బెటా చైర్మన్ రాజమోహన్ పిళై (53)ను కేరళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బిస్కెట్ కింగ్ రాజన్ పిళై సొంత సోదరుడు ఈ రాజమోహన్ పిళై.

ఒడిషాకు చెందిన 23 ఏళ్ల యువతి గతేడాది కేరళకు వలస వెళ్లింది. గత ఎనిమిది నెలల నుంచి ఆమె పిళైకి చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ యువతిపై వ్యాపారి రాజమోహన్ పిళై పలు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్బవతి అయ్యింది.

Businessman Rajmohan Pillai arrested for allegedly raping help in Kerala

కుటుంబ సభ్యులకు తెలిస్తే చంపేస్తారని భయపడిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రి చేరుకుని తనకు అబార్షన్ చెయ్యాలని వైద్యులకు మనవి చేసింది. వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఒడిషా యువతిని విచారణ చేశారు.

తాను ఎనిమిది నెలల నుంచి రాజమోహన్ పిళై దగ్గర ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద లైంగిక దాడి చెయ్యడంతో తల్లిని అయ్యానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వైద్య పరీక్షల్లో యువతి మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది.

గత సోమవారం రాత్రి నుంచి వ్యాపారి రాజమోహన్ పిళై ను పోలీసులు విచారణ చేస్తున్నారు. తరువాత రాజమోహన్ పిళైని అదుపులోకి తీసుకున్నామని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. అయితే తాను మాత్రం అమాయకుడు, తనకు ఏమీ తెలీదని వ్యాపారి రాజమోహన్ పిళ్లై అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+