భార్యకు ప్రేమతో: పుట్టినరోజున సర్‌ప్రైజ్ గిఫ్ట్, గిన్నిస్‌రికార్డ్?
భార్యమీద ప్రేమతో ఆమెకు అపురూప కానుక ఇవ్వాలని భావించాడు. ఒక్కరోజులోనే కొత్త ఇంటిని నిర్మించి భార్యకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆ భార్య ఆనందంలో మునిగిపోయింది.
బెంగుళూరు: భార్యమీద ప్రేమతో ఆమెకు అపురూప కానుక ఇవ్వాలని భావించాడు. ఒక్కరోజులోనే కొత్త ఇంటిని నిర్మించి భార్యకు కానుకగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆ భార్య ఆనందంలో మునిగిపోయింది.
కర్ణాటక రాష్ట్రంలోని కొడుగుకు చెందిన వ్యాపారి త్యాగ్ ఉతప్ప కాఫీ పంటల పెంపకం వ్యాపారం చేస్తాడు. ఈ నెల 16న,, ఉతప్ప భార్య పుట్టినరోజు . దీంతో ఆమెకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు.
అయితే ఒక్కరోజులోనే ఇంటిని నిర్మించి ఇవ్వాలని భావించాడు.ఇందుకోసం దాదాపు రూ.70-80 లక్షల మేర ఖర్చు చేయనున్నారు.అయితే 24 గంటల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేయించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదుచేసుకోవాలన్న తాపత్రయం ఆయనలో ఉంది.

దీంతో ఆ స్పెషల్ డ్రీమ్ హోమ్ కోసం బెంగుళూరుకు చెందిన రెబెల్ డిస్‌రఫ్టీవ్ బిల్డింగ్ టెక్నాలజీస్ అనే కంపెనీతో మాట్లాడారు. ఇంటిని రికార్డు సమయంలో పూర్తిచేయించి ఆమె పుట్టినరోజు కానుక ఇచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని వ్యాపారి త్యాగ్ ఉతప్ప చెప్పారు.
2,400 గజాల స్థలంలో నిర్మించనున్న ఈ ఇంట్లో మూడు బెడ్రూమ్‌లు ఏర్పాటుచేస్తారు. బెంగుళూరు, టి.ఆగ్రహరలో స్టోన్‌హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి సిద్దంగా ఉండే ప్రీకాస్ట్ అచ్చులను ఉపయోగిస్తున్నారు.
సరిగా జూలై 15న ఏ సమయానికి నిర్మాణాన్ని చేపట్టనున్నారో మరునాడు అదే సమయానికి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. ఇప్పటికే రంగులు, లైట్లు, టైల్స్ అలంకరణ సామాగ్రి ఇతర ముడిసరుకులను ఏర్పాటుచేశారు. ఎంత ఖర్చైనా సరే 24 గంటల్లో కాంట్రాక్ట్ కంపెనీ చీఫ్ ప్యాడీ మీనన్ తెలిపారు.












Click it and Unblock the Notifications