Businessman: కూతురి ఫ్రెండ్ తో మమ్మీ ?, రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లీ కూతురు కలిసి !
బెంగళూరు/ బెళగావి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాలకు భర్త దుబాయ్ వెళ్లాడు. భార్య కూతురు ఇక్కడే ఉంటున్నారు. భార్య, కూతురు సంతోషంగా ఉండాలని భర్త ప్రతినెల లక్షకు పైగా డబ్బులు పంపిస్తున్నాడు. దుబాయ్ నుంచి భర్త పంపిస్తున్న డబ్బుతో అతని భార్య, కాలేజ్ లో చదువుతున్న కూతురితో ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ నుంచి సొంత ఊరు వచ్చేసిన భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నాడు. ఇదే సందర్బంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గొడవలు మొదలైనాయి. రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనాడు. డబ్బు కోసం తన భర్తను ఎవరో హత్య చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, కూతురు కేసు పెట్టారు. అయితే క్లైమాక్స్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, కూతురు, ప్రియుడు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

హ్యాపీలైఫ్
కర్ణాటకలోని బెళగావికి చెందిన సుధీర్ భగవానదాస కంబాలి అలియాస్ సుధీర్ (57) అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పూణేలో నివాసం ఉంటున్న రోహిణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. బెళగావిలోని క్యాంప్ ఏరియాలోని మద్రాస్ లేన్ లో సుధీర్, రోహిణి దంపతులు చాలా సంవత్సరాలు కాపురం చేశారు.

దుబాయ్ నుంచి లక్షల్లో డబ్బు పంపించిన సుధీర్
రోహిణిని వివాహం చేసుకున్న సుధీర్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. సుధీర్, రోహిణి దంపతులకు స్నేహా అనే కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత సుధీర్ దుబాయ్ వెళ్లాడు. సుధీర్ భార్య రోహిణి, కూతురు స్నేహా బెళగావిలోనే ఉండేవారు. భార్య రోహిణి, కూతురు స్నేహా ఇక్కడే ఉంటున్నారని, వాళ్లు సంతోషంగా ఉండాలని దుబాయ్ లో ఉన్న సుధీర్ ప్రతినెల లక్షకు పైగా డబ్బులు పంపిచాడు.

కరోనా దెబ్బతో రిటన్... రియల్ ఎస్టేట్ వ్యాపారం
సుధీర్ కూతురు స్నేహా పూణేలోని ప్రముఖ కాలేజ్ లో చదువుతోంది. దుబాయ్ నుంచి భర్త సుధీర్ పంపిస్తున్న డబ్బుతో అతని భార్య రోహిణి, పూణే కాలేజ్ లో చదువుతున్న కూతురు స్నేహా ఎంజాయ్ చేశారు. కరోనా వైరస్ దెబ్బతో సుధీర్ రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ నుంచి బెళగావి వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

భార్య, కూతురి మీద అనుమానం
సొంత ఊరు వచ్చేసిన సుధీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నాడు. ఇదే సమయంలో భార్య రోహిణి, కూతురు స్నేహా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తున్నారని తెలుసుకున్న సుధీర్ రగిలిపోయాడు. ఇదే విషయంలో సుధీర్, రోహిణి దంపతులు, వారి కుమార్తె స్నేహా గొడవ పడటం మొదలుపెట్టారు.

కూతురి ఫ్రెండ్ తో మమ్మీ ?
పూణేలో చదువుతున్న అక్షయ్ అనే వ్యక్తితో సుధీర్ కుమార్తె లవ్ లో పడింది. అక్షయ్ కి ఇంతకు ముందే పెళ్లి జరిగి కొడుకు కూడా ఉన్నాడు. సుధీర్ భార్య రోహిణి కూతురు స్నేహా బాయ్ ఫ్రెండ్ అక్షయ్ తో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదే విషయంలో రగిలిపోయిన సుధీర్ కూతురు స్నేహా పూణే కాలేజ్ కు వెళ్లకుండా చేశాడు.

మమ్మీ, కూతురు, లవర్ కలిసి రియల్ వ్యాపారిని ?
సుధీర్ బతికుంటే మన సంతోషాలకు, విలాసాలకు అడ్డుపడుతాడని అనుకున్న అతని భార్య రోహిణి, కూతురు స్నేహా, ఆమె ప్రియుడు కలిసి ఇదే నెల 17వ తేదీన నిద్రపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్ ను దృశ్యం సినిమా టైప్ లో చంపేశారు. సుధీర్ ను డబ్బు కోసం హత్య చేశారని తల్లీ కూతురు రోహిణి, స్నేహా నాటకాలుఆడారు. అయితే పోలీసుల విచారణలో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

కిలాడీ పెళ్లామ్... కన్నింగ్ కూతురు, టాలెంట్ లవర్
రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్ ను దృశ్యం సినిమా టైప్ లో హత్య చేశారని, ఇదే హత్య కేసులో సుధీర్ భార్య రోహిణి, కూతురు స్నేహా, బాయ్ ఫ్రెండ్ అక్షయ్ ని అరెస్టు చేశామని బెళగావి డీసీపీ రవీంద్ర గడాది మీడియాకు చెప్పారు. అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్య, కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్ చేతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనాడని వెలుగు చూడటం బెళగావిలో కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications