ఉద్యోగం కావాలంటే మీ ఛాతీ సైజు చెప్పాలి: మహిళా సంఘాల ఆందోళన

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖ ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం విధించిన నిబంధన వివాదాస్పదంగా మారింది. ఈ నిబంధనను నిరనిస్తూ మహిళా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొనే మహిళా అభ్యర్థులు తమ ఛాతీ కనీసం 74 సెంటీమీటర్లు ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనను నిరసిస్తూ మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టింది. ఈ నెల 12 వ, తేదిన ఈ నియామాకాల కోసం నోటీఫికేషన్‌ కూడ విడుదలైంది.

అయితే ఈ నోటీఫికేషన్‌ను అధికారులు ఇచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారాయి. ఈ నిబంధలను నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లో మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

మహిళల ఛాతీ కొలతలపై ఇలా

మహిళల ఛాతీ కొలతలపై ఇలా

మధ్యప్రదేశ్‌ సర్కారు అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపికయ్యే మహిళలను ఛాతి కొలతలు చెప్పాలని అడుగుతోంది. ఇప్పటి వరకు యూనిఫాం సర్వీసుల్లో నియామకాల్లో కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే దేహ దారుఢ్య పరీక్షల్లో భాగంగా ఛాతీ కొలతలను అడుగుతున్నారు. మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ నెల 12న విడుదల చేసింది. అటవీశాఖ రేంజ్‌ అధికారులు, అసిస్టెంట్‌ కన్జర్వేటర్ల నియామక నోటిఫికేషన్లో మహిళా అభ్యర్థుల ఛాతి కనీసం 74 సెంటీమీటర్లుగా ఉండాలని, గాలి పీల్చినప్పుడు కనీసం అయిదు సెంటీమీటర్లు వ్యాకోచించాలని నిబంధనను విధించారు.

మహిళా సంఘాల ఆందోళనలు

మహిళా సంఘాల ఆందోళనలు

మధ్యప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల నియామాకాల కోసం విధించిన నిబంధనలపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద నిబంధనను ఎత్తివేయాలని ఆందోళనకు దిగాయి. ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

2008లో రద్దు చేసిన సర్కార్

2008లో రద్దు చేసిన సర్కార్

గతంలోనూ మహిళా అటవీ సంరక్షకుల నియామకాల్లో ఛాతీ కొలతలు ఉండేవి. పలు ఫిర్యాదుల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 2008లో రద్దు చేసింది. మూడేళ్ల క్రితం తిరిగి ప్రవేశపెట్టారు.ఈ నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ కొనసాగుతోంది.

నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్

నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్

ఈ నిబంధనను అవసరమైతే ఎత్తేస్తామని అదికారులు చెబుతున్నారు. ఎత్తేసే ఉద్దేశం ఉంటే, ఎందుకు పెట్టారని మహిళా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ నిబంధనను ఎత్తివేస్తేనే ప్రయోజనమని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ నిబంధనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+