కాంగ్రెస్‌లో మరో విషాదం: బూటా సింగ్ కన్నుమూత -గొప్ప పాలనా దక్షుడంటూ ప్రధాని మోదీ నివాళి
పంజాబ్ కు చెందిన బూటా సింగ్.. రాజీవ్ గాంధీ కేబినెట్ లో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగానూ సేవలందించారు. 1970, 80వ దశకాల్లో పంజాబ్ వేదికగా కొనసాగిన ఖలిస్థాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో బూటా కీలక పాత్ర పోశించారు. స్వర్ణదేవాలయంలో సైనికచర్యగా పేరుపొందిన 'ఆపరేషన్ బ్లూ స్టార్'లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
కాంగ్రెస్ యోధుడు బూటా సింగ్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బూటా మరణం బాద కలిగించిందని, దేశంలో పేరెన్నిక గల గొప్ప పాలనా దక్షుల్లో ఆయన కూడా ఒకరని, ఈ విషాద సమయంలో బూటా కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు.

బూటా సింగ్ 1934, మార్చి 21న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా ముస్తఫాపూర్ లో జన్మించారు. అకాలీదళ్ పార్టీ ద్వారా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన 1960లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పలు మార్లు ఎంపీగా గెలుపొంది, కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1978లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన కీలక నేతగా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా బూటా సింగ్ వ్యవహరించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications