వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక పోటీపై తొలగని సస్పెన్స్! ప్రయాగ్‌రాజ్ నుంచి బరిలో దిగే ఛాన్స్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : ప్రియాంక పోటీపై తొలగని సస్పెన్స్! || Oneindia Telugu

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పోటీపై పుకార్లు షికారు చేస్తున్నాయి. అన్న ఆదేశిస్తే మోడీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి బరిలో దిగుతానని ప్రియాంక అంటుండగా.. ఆమె ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నయి. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు లోక్‌సభ బరిలో నిలుస్తారా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

మీకు మీరే..మాకు మేమే! ఆమ్ ఆద్మీతో కుదురని పొత్తు..కాంగ్రెస్ ఒంటరిపోరుమీకు మీరే..మాకు మేమే! ఆమ్ ఆద్మీతో కుదురని పొత్తు..కాంగ్రెస్ ఒంటరిపోరు

ప్రయాగ్‌రాజ్ నుంచి పోటీ?

ప్రయాగ్‌రాజ్ నుంచి పోటీ?

ప్రస్తుతం ప్రియాంకగాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను వారణాసి నుంచి కాకుండా ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నుంచి పోటీ చేయించడం మంచిదని సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి గట్టి పట్టున నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి బరిలో దిగితే ఆమె విజయం తథ్యమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక పోటీపై అనుమానం

ప్రియాంక పోటీపై అనుమానం

నిన్న వారణాసి, నేడు ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేస్తారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆమె నిజంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారా? లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. అన్న ఆదేశిస్తే వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీకి సిద్ధమన్న ప్రియాంక బాల్‌ను రాహుల్ గాంధీ కోర్టులోకి విసిరారు. అయితే దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.

త్వరలోనే హైకమాండ్ నిర్ణయం?

త్వరలోనే హైకమాండ్ నిర్ణయం?

సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక పోటీపై త్వరలోనే స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. పార్టీ సీనియర్లతో చర్చించి వారు నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి, విజయలక్ష్మీ పండిత్, వీపీ సింగ్ తదితర సీనియర్ నేతలంతా ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), పక్కనే ఉన్న ఫుల్‌పూర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు.

English summary
Congress leader Priyanka Gandhi Vadra’s close aides have advised her to contest from her party’s former bastion of Prayagraj. according to a senior party functionary aware of the developments. Even as there is no clarity on whether Priyanka Gandhi, 47, will fight in the 2019 Lok Sabha elections, there has been some speculation of late that she may contest from Varanasi against Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X