సీఎం మంచి మనసు, లంచ భాగ్యం స్కీమ్ త్వరలో విడుదల, దర్యాప్తు చేసే ధైర్యం ఉంటే ?
బెంగళూరు: మైసూరు (Mysuru)దసరా ఉత్సవాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం నుంచి కమీషన్ వసూలు చేసే పనిలో ఉన్న మీ ప్రభుత్వ పాలనలోని నీచమైన అవినీతితో కూరుకుపోయిందని బహిరంగంగా ప్రజల ముందు బట్టబయలైందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే త్వరలో ఈ రాష్ట్రంలో లంచ భాగ్యం అనే కొత్త పథకం మీరు ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతున్నారని అనుమానం వస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో (Karnataka) హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించి బుధవారం బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah) బ్లాక్ మనీ ఖజానా ఉన్నచోట్లు వదిలేసి పేదల ఇంటిపై దాడులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటక (Karnataka)రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖ సోదాలను ముఖ్యమంత్రిగా మీరు స్వాగతించాల్సి ఉందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర అన్నారు.

అయితే వ్యాపారులు, కాంట్రాక్టర్ల అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం (govt) లోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సోదాలను పోల్చి చూస్తే అది నిజమే అనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలోని (Karnataka) సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని చూస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారనే సామెత గుర్తుకు వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

మీ మాటలు ప్రభుత్వ దర్యాప్తు (CBI) సంస్థలను నిరుత్సాహపరిచే విదంగా ఉన్నాయని బీవై విజయేంద్ర ఆరోపించారు. మీ కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వంలో (govt) జైలుకెళ్లిన నాయకులు, ఇంకా జైలుకెళ్లాల్సిన వారు చాలా మంది ఉన్నారని మీరు మరిచిపోయారని బీవై, విజయేంద్ర ఆరోపించారు. ఈ విషయాలు పూర్తిగా మరిచిపోయిన మీరు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) పేరు ప్రస్తావిస్తూ విమర్శించడం విడ్డూరంగా ఉందని, చరిత్రను మరచిపోయి మీరు మాట్లాడడం మీకే సరిపోతుందని, నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తే అందరికి మంచిదని బీవై. విజయేంద్ర మండిపడ్డారు.

రాజకీయ చిక్కులను ఛేదించి న్యాయ పోరాటం చేసి ప్రజల దగ్గర మద్దతు సంపాధించి జనతా దర్బారులో మళ్లీ ముఖ్యమంత్రి (CM) అయిన నిజాయితీకలిగి మళ్లీ సీఎం అయిన నాయకుడు బీఎస్ యడ్యూరప్ప అని, అలాంటి వ్యక్తిని మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తే తగిన బుద్ది చెబుతామని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే (MLA) బీవై, విజయేంద్ర హెచ్చరించారు. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం త్వరలో లంచ భాగ్యం అనే అవినీతి పథకం అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్చం లేదని బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) కుమారుడు (son) బీవై, విజయేంద్ర ఆరోపించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications