Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లైవ్: 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు!: ఈవీఎంలలో లోపాలు?

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లోని 4 లోక్ సభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉపఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా ఉత్తప్రదేశ్ లోని కైరానా లోక్ సభ స్థానం పైనే దృష్టి నిలిచింది. ఇటీవల గోరఖ్ పూర్, ఫల్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో.. ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయా?, లేక బీజేపీ సత్తా చాటుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

ఇక మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా-గోండియా లోక్ సభ స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్ లోని సోలె పార్లమెంటు స్థానానికి కూడా నేడు ఉపఎన్నిక జరగనుంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. నూర్పూర్(ఉత్తరప్రదేశ్), షాకోట్(పంజాబ్), జోకిహట్(బీహార్), గోమియా&సిల్లి(జార్ఖండ్), చెంగన్నూర్(కేరళ), పాలస్ కడేగాన్(మహారాష్ట్ర), అపంతి(మేఘాలయ), తరలి(ఉత్తరాఖండ్), మహేస్తల(పశ్చిమ బెంగాల్), రాజరాజేశ్వరి(కర్ణాటక)లకు నేడు ఉపఎన్నికలు జరగనున్నాయి.

bypolls started in 4 Lok Sabha, 10 assembly seats today

May 28, 2018, 6:00 pm IST

ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదంటూ ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు పలువురు బీజేపీ నేతలు.
May 28, 2018, 5:42 pm IST

పంజాబ్‌లోని షహల్‌కోట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సాయంత్రం 5గంటల వరకు 69శాతం పోలింగ్ నమోదైంది.
May 28, 2018, 5:39 pm IST

మహేస్థల అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల వరకు రికార్డు స్థాయిలో 70.01శాతం ఓటింగ్ నమోదైంది.
May 28, 2018, 4:46 pm IST

సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఎన్నికల సంఘం అధికారిని కలిశారు. కైరానా, నూర్పూర్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని, అందువల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని తెలిపారు. సాయంత్రం 6గంటల తర్వాత కూడా ఓటర్లకు ఓటు వేసే అవశాకాన్ని కల్పించాలని చెప్పారు. మరికొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.
May 28, 2018, 4:02 pm IST

సోమవారం 3గంటల వరకు మహెస్థలలో అత్యధికంగా 67శాతం పోలింగ్ నమోదైంది.
May 28, 2018, 4:01 pm IST

రాజరాజేశ్వరినగర్(ఆర్ఆర్ నగర్) నియోజకవర్గంకు జరుగుతున్న ఎన్నికల్లో 3గంటల వరకు 41శాతం పోలింగ్ నమోదైంది.
May 28, 2018, 2:58 pm IST

కర్ణాటకలోని ఆర్ఆర్‌నగర్ నియోజకవర్గంకు జరుగుతున్న ఎన్నికల్లో సోమవారం ఒంటిగంట వరకు 34శాతం ఓటింగ్ నమోదైంది.
May 28, 2018, 2:08 pm IST

మహారాష్ట్ర-పాల్ఘర్ నియోజకవర్గంలో ఒంటిగంట వరకు 19.25శాతం ఓటింగ్ నమోదైంది. అంతకుముందు ఈవీఎంలలో లోపాలు తలెత్తి కొద్దిగంటలు పోలింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈవీఎంలు సరిగానే పనిచేస్తున్నాయని రిటర్నింగ్ అధికారి డా.ప్రశాంత్ తెలిపారు.
May 28, 2018, 1:36 pm IST

పంజాబ్ షాకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంటిగంట వరకు 44శాతం ఓటింగ్ నమోదైంది.
May 28, 2018, 1:10 pm IST

ఈవీఎంలు, వివిపాట్ మెషీన్లలో సాంకేతిక లోపాలు కచ్చితంగా ఎన్నికల కమిషన్ వైఫల్యమే. ఉపఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల పరిస్థితేంటి?. మేమూ, మాతో పాటు చాలా పార్టీలు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం, పోలింగ్ ఈవీఎంల ద్వారా వద్దు, బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని.: అనిల్ దేశాయి, శివసేన
May 28, 2018, 12:49 pm IST

మహారాష్ట్ర, భండారా-గోందియా లోక్ సభ బైపోల్స్: 35బూత్ లలో ఈవీఎం మెషీన్లలో తలెత్తిన లోపాల కారణంగా తాత్కాలికంగా పోలింగ్ నిలిచిపోయింది. జిల్లా మెజిస్ట్రేట్ అభిమన్యు కలె ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
May 28, 2018, 12:06 pm IST

పంజాబ్ షాకోట్ నియోజకవర్గంలో ఉదయం 11గం. వరకి 31శాతం ఓటింగ్ నమోదైంది.
May 28, 2018, 11:46 am IST

కర్ణాటక రాజరాజేశ్వరి నియోజకవర్గంలో ఉదయం 11గం. వరకి 21శాతం పోలింగ్ నమోదైంది.
May 28, 2018, 11:35 am IST

కైరానా లోక్ సభ ఉపఎన్నికల్లో ఆర్.ఎల్.డి తరుపున పోటీ చేస్తున్న తబస్సుం హసన్ ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాశారు. దాదాపు 175చోట్ల ఈవీఎంలు, వివిపాట్ లు పనిచేయడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
May 28, 2018, 10:55 am IST

నూర్పూర్ లో 140ఈవీఎంలు పనిచేయడం లేదని చెబుతున్నారు, బీజేపీ వాటిని ట్యాంపరింగ్ చేయడం వల్లే ఇలా జరిగింది. అటు కైరానాలోనూ ఇదే పరిస్థితి. గోరఖ్ పూర్, ఫల్పూర్ ఉపఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటున్న బీజేపీ.. ఎలాగైనా మమ్మల్ని ఓడించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తోంది: రాజేంద్ర చౌదరి, సమాజ్ వాదీ పార్టీ
May 28, 2018, 10:30 am IST

మహారాష్ట్ర-పాల్ఘర్ లోక్ సభ బైపోల్: ఓటు తర్వాత చూపుడు వేలుకు వేయాల్సిన ఇంకు మార్కును మధ్య వేలుకు వేశారు. అయితే ఇటీవలే ఇక్కడ పంచాయితీ ఎన్నికలు జరగడంతో.. ఆ తేడాను గుర్తించేందుకే అధికారులు ఇలా చేశారు.
May 28, 2018, 10:26 am IST

నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 9గం. వరకు 6శాతం ఓటింగ్ నమోదైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+