బెంగళూరులో మహిళపై క్యాబ్ డ్రైవర్ దారుణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై 24 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కోరమంగళలోని ఫిఫ్త్ బ్లాక్‌లో జరిగింది.
నిందితుడు బాధితురాలి వెంటపడి, వేధించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన క్రమంలో మహిళ అతనితో పెనుగులాడింది. పెద్దగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి వచ్చి చేరడంతో నిందితుడు పారిపోయాడు.
మసక చీకట్లో రోడ్డుపై మహిళ నడిచి వెళ్తుండగా, ఆమెను లైంగికంగా లక్ష్యం చేసుకోవాలనే కోరిక కలిగిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కోరమంగళలోని వసతి గృహంలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకుంది.

రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నిందితుడు జెపి నగర్‌లోని ఓ హోటల్ వద్ద తనను పట్టుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది. నిందితుడిని బైరేష్‌గా గుర్తించారు .వివాహితుడైన అతను గోర్గుంటపాలయ సమీపంలోని కపిల్ నగర్‌లో నివసిస్తున్నాడు.
మహిళ కేకలు వేయడంతో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు స్థానికులు వెంట పడి అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications