Cab driver warnings: నవ్వులు పూయిస్తున్న క్యాబ్ డ్రైవర్ల వార్నింగ్స్.. సోషల్ మీడియాలో వైరల్
Hyderabad News: మన దేశంలో క్రియేటివిటీ మరియు టాలెంట్‌కు కొదువ లేదు. ఎందరో మట్టిలో మాణిక్యాలు గొప్పగా ఎదిగిన చరిత్ర భారత్ సొంతం. కాలానుగుణ సామెతలు, హాస్యాస్పద వ్యాఖ్యలకు ఆటోవాలాలు పెట్టింది పేరు. గతంలో ఆటోల వెనుకకు మాత్రమే పరిమితమైన కొటేషన్లు క్రమేపీ క్యాబ్‌లకు సైతం విస్తరించాయి. హైదరాబాద్‌లోని ట్యాక్సీలలో డ్రైవర్స్ పెడుతున్న హెచ్చరికలు ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.
భాగ్యనగరానికి చెందిన కొందరు క్యాబ్ డ్రైవర్స్ ప్రయాణికులను ఉద్దేశించి తమ కార్లలో పెడుతున్న హాస్యాస్పద సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 'హెచ్చరిక!! నో రొమాన్స్. ఇది క్యాబ్, మీ ప్రైవేట్ స్థలం కాదు. కాబట్టి దయచేసి దూరంగా మరియు ప్రశాంతంగా ఉండండి' అంటూ తమ వాహనాల్లో ప్రయాణించే జంటలను సున్నితంగా హెచ్చరిస్తున్నారు.

🚖 ⚠️ 😂
— Hi Hyderabad (@HiHyderabad) October 20, 2024
📸: @venkatesh_2204 #Hyderabad pic.twitter.com/xwjel4VQiI
ఈ విధమైన హెచ్చరిక సోషల్ మీడియా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. Xలో షేర్ చేసిన ఈ పోస్టును మూడురోజుల్లో 85 వేలకుపైగా వీక్షించారు. దీనిపై పలువురు వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేశారు. తన అభిప్రాయాన్ని సున్నితంగా, హాస్యాస్పదంగా తెలియజేసిన డ్రైవర్ చాకచక్యంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'క్యాబ్ ప్రయాణీకులకు ఇదొక నైతిక పరమైన ముఖ్యమైన సందేశం' అని ఒక యూజర్ చమత్కరించారు. OYO రూమ్‌ల కోసం ఇది తెలివైన మార్కెటింగ్ వ్యూహంగా మరికొందరు పేర్కొంటున్నారు. కాగా ఈ తరహా ట్యాక్సీ మర్యాదలపై బెంగళూరులో కూడా ఇటీవల ఓ పోస్ట్ వైరల్ అయింది. ప్రయాణీకులకు 6 నియమాలతో కూడిన ఓ సందేశాన్ని ముందు సీటు వెనుక అతికించాడు. 'డ్రైవర్‌ను భయ్యా అని పిలవవద్దు, మీ యాటిట్యూడ్‌ను మడిచి పాకెట్‌లో పెట్టుకో' అనే సందేశాలు హైలెట్‌గా నిలిచాయి.
Cab driver puts up 6 rules for passengers, says
— I Tweet Everything (@comedy_whatsapp) October 15, 2024
'Don't call me bhaiya' 😮😁😂
Some of the guidelines read- 'You are not the owner of cab',
'You are not the owner of cab', 'Put your attitude in your pocket', 😂 "Calling them uncle from now on."#cabdriver #ViralNews pic.twitter.com/jUy9LgLAP4












Click it and Unblock the Notifications