రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్: ఖరీఫ్ సీజన్‌కు మద్దతు ధర పెంపు, వరికే అత్యధికం
న్యూఢిల్లీ: రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోడ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధరలను బుధవారం పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధర రూ.2,183గా నిర్ణయించింది. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది.
'ఎ' గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరను 163 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ఆ గ్రేడ్ ధరను.. రూ. 2,203 రూపాయలుగా ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ. 8,558గా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ 2023-2024లో కనీస మద్దతు ధరలో క్యాబినెట్ చేసిన అత్యధిక వృద్ధి ఇదేనని అన్నారు. అలాగే హర్యానా.. గురుగ్రాంలో 28.5 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని గోయల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.5,452 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.
कृषि कल्याण को समर्पित PM @NarendraModi जी की सरकार ने खरीफ फसलों पर MSP को बढ़ाने का महत्वपूर्ण निर्णय लिया है।
— Piyush Goyal (@PiyushGoyal) June 7, 2023
इससे भारत में अन्नदाताओं को फसलों के उत्पादन से अधिक लाभ सुनिश्चित होगा और विश्वभर में Millets के उपयोग को बढ़ावा देने में सहायक सिद्ध होगा। pic.twitter.com/UOJI95vocl
కొత్త ఎంఎస్‌పీ ప్రకారం వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,040 నుంచి రూ.2,183కి పెరిగింది. మూంగ్ దాల్ ధర కూడా అత్యధికంగా పెరిగింది. దీని కోసం ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు.కనీస మద్దతు ధర అంటే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే రేటు. ప్రస్తుతం, ఖరీఫ్, రబీ సీజన్లలో పండించే 23 పంటలకు ప్రభుత్వం MSP ని నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (వేసవి) పంటలు పండించిన వెంటనే రబీ (శీతాకాలపు) పంటల విత్తడం అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. గోధుమ, ఆవాలు ప్రధాన రబీ పంటలు.
ఈ సమావేశంలో మణిపూర్, బాలాసోర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, మంత్రులందరూ సంతాపం తెలిపారని గోయల్ తెలిపారు. ఎంఎస్పీతో పాటు, హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ, గురుగ్రామ్ విత్ స్పర్ నుంచి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వరకు మెట్రో కనెక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తిగా ఎలివేటెడ్ ప్రాజెక్టుకు రూ.5,452 కోట్లు ఖర్చవుతుందని పీయూష్ గోయల్ తెలిపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications