4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్‌షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మొత్తం రూ. 59 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఇందులో 60 శాతం శాతం కేంద్రం భరించనుండగా, 40 శాతం ప్రభుత్వాలు భరించనున్నాయని కేంద్రమంత్రి థావర్ చంద్ర గెహ్లాట్ తెలిపారు.
Recommended Video

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్ చంద్ గెహ్లాట్ మీడియాకు వెల్లడించారు. కాగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పలు విభాగాలను విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఫిల్మ్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కీవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ విభాగాలను విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. డీటీహెచ్ సేవలకు సంబంధించిన సవరించిన మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.
డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాలను పంచుకునేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పదేళ్లకే ఇస్తున్న లైసెన్స్‌ను ఇకపై 20 ఏళ్లకు జారీ చేయనున్నారు. అలాగే డీటీహెచ్ రంగంలో నూరు శాతం ఎప్‌డీఐలకు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇది 49 శాతంగా ఉంది. లైసెన్స్ ఫీజును ఏడాదికి బదులు ఇక నుంచి మూడు నెలలకు ఓసారి వసూలు చేయనుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications