ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక.. మరో కోణం!?

మంత్రిమండలి విస్తరణ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ, ఓ కేంద్ర మంత్రి రాజీనామా వెనుక మరోకోణం ఉన్నట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి విస్తరణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం సూచన మేరకు మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ, ఓ కేంద్ర మంత్రి రాజీనామా వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టు తాజాగా తెలిసింది.

అవినీతి ఆరోపణలతోనే సదరు మంత్రిపై వేటు వేసినట్టు సమాచారం. ఈ మధ్య అవినీతి కేసులో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టైన అధికారులను సీబీఐ విచారించగా.. సదరు మంత్రిగారి అవినీతి బాగోతం బయటపడింది.

pm-modi

కాల్‌ డాటా, ఫోన్‌ సంభాషణలను పరిశీలించి మరీ సీబీఐ ఆయన అవినీతిని ధ్రువీకరించుకుంది. ఈ వ్యవహారం తన దృష్టికి చేరడంతో సదరు మంత్రిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ బాగోతం బయటపడకముందే రాజీనామా చేయాలని ఆయనను మోడీ ఆదేశించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ మంత్రి అవినీతి వ్యవహారం పూర్తిగా బయటకు రాలేదు.

అవినీతి రహిత పాలన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ దృఢనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. తన కేబినెట్‌లో ఎవరూ అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రమంత్రి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+