దారుణం: సీఏఎఫ్ కమాండర్‌ను గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సీఏఎఫ్ కమాండర్‌పై గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్భ డివిజన్ కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు క్యాంపు నుంచి తేజు రామ్ భూర్య కూరగాయలు తీసుకురావడానికి సిబ్బందితో కలిసి బయల్దేరారు. ఆకస్మాత్తుగా మావోయిస్టులు అక్కడకు చేరుకుని రామ్ భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

వెంటనే భద్రతా సిబ్బంది శిబిరంలోని బలగాలను అప్రమత్తం చేశాయి. అదనపు దళాలతో సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుండుగులు అక్కడ్నుంచి తప్పించుకున్నారు.
"భూర్యా బస్తర్‌లోని వివిధ ప్రాంతాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో భాగమైన అనుభవజ్ఞుడైన అధికారి . మావోయిస్టులు మిలీషియా సభ్యులు, వారు గ్రామంలోనే ఉండి పోలీసుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తారు' అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు సీఏఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications