• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రానికి కాగ్ మొట్టికాయ: కాలం చెల్లిన మందులు సరఫరా చేస్తున్నారు

|

న్యూఢిల్లీ: దేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ద్వారా దేశంలోని గ్రామాలకు మందులు సరఫరా చేయబడుతున్నాయి. 2011 నుంచి 2016 మధ్య 14 రాష్ట్రాల్లో సరఫరా చేయబడిన మందులు ఎక్స్‌పైరీ తేదీ మించిపోయనవే అని కాంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ కాగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీహార్ హర్యానా జార్ఖండ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాలం చెల్లిన మందులు వాడి చాలామంది రోగులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని కాగ్ పేర్కొంది. మందులపై సరైన చెకింగ్ నిర్వహించకుండా వాటిని సరఫరా చేశారని కాగ్ వెల్లడించింది.

2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎన్డీఏ సర్కార్ ఈ పథకాన్ని తిరిగి తీసుకురానుంది. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం దేశంలోనే అతిపెద్ద రెండో పథకంగా నిలవనుంది. ముఖ్యమైన మందులైన పారాసిటామాల్, విటమిన్ బీ కాంప్లెక్స్ మాత్రలు కూడా దాదాపు 24 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లో అందుబాటులో లేవని కాగ్ వెల్లడించింది. చాలా జిల్లా ఆస్పత్రుల్లో , ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో, మండల ఆస్పత్రుల్లో డాక్లర్లు లేరని, ఆరోగ్య రంగానికి చెందిన సిబ్బంది, టెక్నీషియన్లు, మందులు, ఎక్విప్‌మెంట్ లేదని కాగ్ వెల్లడించింది. దీంతో ప్రజా ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోందని కాగ్ వెల్లడించింది.

CAG gives health report: Expired medicines distributed,no doctors and equipments in hospitals

ఆరోగ్య సంస్థలు 2011 నుంచి2016 వరకు రూ.1,10,930 కోట్ల నుంచి రూ. 1,06179 కోట్లు ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ రికార్డులు చూపిస్తున్నాయి. అయితే అంత కనిపించడంలేదని కాగ్ మొట్టికాయ వేసింది. మరోవైపు ఆరోగ్యరంగానికి సంబంధించి నియామకాలు రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు కేంద్రం చర్చించాలని, నియామకాలు పూర్తిస్థాయిలో జరిగాయో లేదో పర్యవేక్షించాలని సూచించింది. ఆరోగ్య రంగంలో ఫలితాలు బాగా ఉంటే మరింద అభివృద్ధి పరిచేలా నిధులు ఎక్కువగా కేటాయించాలని సూచించింది. నిధులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించింది. ఉదాహరణకు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో మూడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులను పరిశీలించగా ఆపరేషన్‌కు ముందు రోగులను ఉంచే గదులు, ఆపరేషన్ తర్వాత రోగులను ఉంచే గదులు అసలు లేవని కాగ్ చెప్పింది. దీంతో ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని కాగ్ అభిప్రాయపడింది. మరో వైపు గోద్రాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 440 పడకలకు గాను 210 పడకలు మాత్రమే ఉన్నాయని మిగతా పేషెంట్లు నేలపై పడుకుంటున్నారని కాగ్ తెలిపింది.

ఇక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి 17 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని కాగ్ వెల్లడించింది. రూ.30 కోట్లు విలువ చేసే 428 రకాల పరికరాలు అందుబాటులో లేవని చెప్పింది. అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, ఈసీజీ లాంటి సాధారణ పరికరాలు కూడా లేవంటే పరిస్థితి మరింత అద్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కాగ్. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సరైన వైద్యులు, శిక్షణ గల సిబ్బంది లేక అవి ఖాళీగా ఉన్నాయని కాగ్ చెప్పింది. కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణులకు లేబర్ టేబుల్, డెలివరీ కిట్లు, ఎమర్జెన్సీ పరికరాలు లేవని పేర్కొంది. అంబులెన్స్ కొనుగోలుకు 8 రాష్ట్రాలకు రూ.175 కోట్లు నిధులు విడుదల చేస్తే రూ.155 కోట్లు ఖర్చు కాలేదని కాగ్ పేర్కొంది. ఉన్న అంబులెన్స్‌ల కోసం ఫోన్ కాల్స్ వస్తే స్పందించడంలేదని కాగ్ వెల్లడించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Medicines distributed under the National Rural Health Mission (NRHM) — India’s largest health scheme so far — in 14 states between 2011 and 2016 were past their expiry dates, says the latest report by the Comptroller and Auditor General (CAG).The audit report says patients in these states, which included Bihar, Haryana, Jharkhand, Karnataka, Kerala, Maharashtra and Uttar Pradesh, were exposed to health risks as they were issued medicines without ensuring the prescribed quality checks and without observing their expiry period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more