వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత దూడ.. మనిషి స్వభావం.. పాటలకు స్టెప్పులు కూడా..!

|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనాడులో వింత చోటు చేసుకుంది. ఇటీవల జన్మించిన దూడ అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తోంది. తినడం, పడుకోవడం, పాటలకు స్టెప్పులేయడం.. ఇలా చిత్రవిచిత్రాలు చేస్తోంది. దాన్ని చూసినవాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుంటూ ముచ్చటపడుతున్నారు.

<strong>ఈజీగా హత్యలు , అత్యాచారాలు.. ఫేస్‌బుక్‌ నిండా అమ్మాయిలు.. శ్రీనివాస్ రెడ్డి రాక్షస జీవితం (వీడియో)</strong>ఈజీగా హత్యలు , అత్యాచారాలు.. ఫేస్‌బుక్‌ నిండా అమ్మాయిలు.. శ్రీనివాస్ రెడ్డి రాక్షస జీవితం (వీడియో)

 అచ్చం మనిషిలాగే..!

అచ్చం మనిషిలాగే..!

తమిళనాడు వేలూరు జిల్లా ఆంబూరులో ఈ వింత దూడకు జన్మనిచ్చింది ఆవు. వీరకుప్పానికి చెందిన ఆనందన్ అనే వ్యక్తి ఇంట్లో జన్మించిన దూడ.. నడవడం వచ్చీ రాగానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది. మామూలుగా పశువులు ఆరుబయట పెట్టిన నీళ్లు తాగుతుంటాయి. కానీ ఈ దూడకు మాత్రం ఆ ఇంటి మనుషులు తాగే మంచినీరు మాత్రమే కావాలి.

అంతేకాదు అది పడుకోవడం కూడా చిత్రంగానే ఉంటోంది. అన్నీ పశువుల్లాగా కొట్టంలో పడుకోవడం లేదు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎక్కడైతే పడుకుంటారో.. అక్కడే ఎంచక్కా నిద్రపోతోంది. ఇక వాళ్లు ఏదైనా తింటే చాలు.. నాకేది అన్నట్లుగా చూస్తోందట. సర్లే అని పెడితే అచ్చం మనుషుల్లాగే కరకరా నమిలి మింగేస్తోంది.

మ్యూజిక్ సెన్స్ కూడా..!

మ్యూజిక్ సెన్స్ కూడా..!

ఈ దూడకు సంబంధించి ఎంత చెప్పినా తక్కువే. కొట్టంలోకి తీసుకెళ్లి ఉంచినా.. కొద్దిసేపటికే తిరిగొచ్చి ఇంట్లో సందడిగా తిరుగుతోంది. జస్ట్ పాల కోసం మాత్రమే ఆవు దగ్గరకు వెళుతోంది. దీని ముద్దు మురిపాలు చూసి ఆ ఇంటోళ్లు వేలన్ అంటూ పేరు కూడా పెట్టేశారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ దూడకు మాంఛి మ్యూజిక్ సెన్స్ కూడా ఉంది. వాళ్లు పాటలు పెట్టుకుంటే ఎంచక్కా డ్యాన్స్ కూడా చేస్తోంది.

 క్యూ కడుతున్న జనం

క్యూ కడుతున్న జనం

ఈ వింత దూడ గురించి తెలియగానే చూడటానికి జనాలు క్యూ కడుతున్నారు. కొందరేమో సెల్ఫీలు తీసుకుంటుంటే.. మరికొందరేమో డిఫరెంట్ షెడ్స్ లో ఫోటోలు దిగుతున్నారు. అయితే ఈ దూడ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందోనని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అదలావుంటే పరిసరాలను చూసి కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో ఇలా జరుగుతుందేమోనని మరికొందరు అనుకుంటున్నారు.

English summary
Calf Behaviour like human being viral in Tamilnadu. Calf behaviour giving surprise as eating, sleeping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X