• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శృంగారంతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా..? యువత మెదళ్లను తొలుస్తున్న సందేహం..!!

|

హైదరాబాద్ : జాతీయ అంతర్జాతీయ యువతీ యువకుల్లో ఇప్పుడు ఒకే ఒక సందేహం పిచ్చెక్కిస్తోందట. యువతలో ఉదయించిన ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇంటర్ నెట్ లో అనేక రూపాల్లో అనేక సైట్లను వడపోస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ శృంగారం మీద ప్రభావం చూపిస్తుందా అన్నదే నేటి యువతీ యువకుల ధర్మ సందేహంగా తెలుస్తోంది. అయితే ప్రపంచ యువతీ యువకుల సందేహాలకు దొరికిన సమాధానాల పట్ల షాక్ అవుతున్నారట. ఇంతకీ అమెరికా, చైనాలో శృంగారంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా అని చేసిన ప్రయోగాలు ఎలాంటి అంశాన్ని నిర్థారించాయి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శృంగారంలో పాల్గొనాలా వద్దా... యువతను కంగారు పెడుతున్న కరోనా వైరస్..

శృంగారంలో పాల్గొనాలా వద్దా... యువతను కంగారు పెడుతున్న కరోనా వైరస్..

కరోనా వైరస్ గజగజ వణికిస్తున్న వేళ యువతకు చిత్ర విచిత్ర సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే సహజంగా వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ.. మనసుకు వచ్చే కొన్ని సందేహాలను మాత్రం అంత తొందరగా బహిర్గతం చేయలేని సందర్డాలను సైతం కొందరు ఎదుర్కొంటూ ఉంటారు. అదే సందేహం ఇప్పుడు లక్షల మంది యువత మెదళ్లను తొలుస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కుగ్రమాలకు వ్యాప్తి చెందుతున్న వేళ శృంగారంలో పాల్గొంటే ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చి ఏమైనా సమస్యలు ఉద్బవిస్తాయా అన్నదే ఇప్పుడు దేశంలోని యువత ప్రధాన సందేహంగా తెలుస్తోంది.

శృంగారంతో కరోనా వ్యాపిస్తుందా .. యువతలో కలుగుతున్న ధర్మ సందేహం..

శృంగారంతో కరోనా వ్యాపిస్తుందా .. యువతలో కలుగుతున్న ధర్మ సందేహం..

మరి శృంగారం తర్వాత మందు మాకు లేని కరోనా వైరస్ సోకితే పరిస్థితి ఏంటని యువత తమలో తాము కృంగిపోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గూగుల్ లో తెగ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఐతే ఇదే అంశానికి సంబంధించి శృంగార సందేహాలకు సమాధానాలు ఇచ్చే

కొంతమంది డాక్టర్లు మాత్రం ఆసక్తికర అంశాలను వివరిస్తున్నారు. డాక్టర్లు చెప్పుకొస్తున్న అంశాల పట్ల యువత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ల సలహాలను తూచా తప్పకుండా పాటిస్తామని యువత చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది.

శృంగారినికి కోవిడ్-19కు ఉన్న లింకేంటి..? గూగుల్ లో ఉదృతంగా సెర్చ్ చేస్తున్న యువత..

శృంగారినికి కోవిడ్-19కు ఉన్న లింకేంటి..? గూగుల్ లో ఉదృతంగా సెర్చ్ చేస్తున్న యువత..

ఇక ఇదే అంశంపై అంతర్జాతీయంగా యువతీ యువకుల మధ్య పెద్ద యెత్తున చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అమెరికా, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు పలువురు పరిశోధనలు చేశారు. పురుషల వీర్యంలో వైరస్ ఉన్నట్లుగా ఆధారాలు లేవని తేల్చారు. ఎబోలా.. జికా.. సార్స్.. కొవిడ్ 19తోపాటు కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్ .. సెక్సు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దశలో డాక్టర్లు ఎంతో కీలక అంశాలను వెల్లడిస్తున్నారు. ఇదే అంశంపై లోతైన పరిశోధనల్ని జరిపారు. ఇందులో భాగంగా చైనాకు చెందిన 34 మంది రోగుల వీర్యం నమూనాల్ని సేకరించినట్టు ప్రయోగాలు చేసినట్టు తెలుస్తోంది.

శృంగారంతో కరోనా వైరస్ రాదు.. తేల్చి చెబుతున్న డాక్టర్లు..

శృంగారంతో కరోనా వైరస్ రాదు.. తేల్చి చెబుతున్న డాక్టర్లు..

ఆ కణాలను ప్రయోగశాలలో పరీక్షలు జరిపినప్పుడు అందులో వైరస్ జాడలు కనిపించకపోవటాన్ని గుర్తించారు. అయితే.. ఇదంతా ప్రాథమిక స్థాయిలో సాగిన అధ్యయనమని, మరింత లోతుగా పరిశోధన సాగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అప్పుడు మాత్రమే.. కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా తాజాగా అమెరికాతో పాటు చైనాలో జరిపిన ప్రయోగాల్లో మాత్రం ఎలాంటి ప్రమాదం లేదనే సంకేతాలు వచ్చినట్టు స్పష్టం చేస్తున్నారు. వారి లెక్క ప్రకారం శృంగారంతో కొవిడ్-19 ఏమాత్రం వ్యాప్తి చెందదని విశ్లేషిస్తున్నారు డాక్టర్లు. దీంతో యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది.

English summary
The latest US and China-based experiments are making clear that there are no signs of danger. Doctors are developing the idea that Kovid-19 has nothing to do with porn. This seems to be the reason for big releaf for the young men and women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X