Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బయట నుంచి తెచ్చుకొని తినండి: బీఫ్‌పై హైకోర్టు

ముంబై: మహారాష్ట్రలో పశు మాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం బయట నుంచి బీఫ్‌ తెచ్చుకోవడం అక్రమం కాదని బాంబే హైకోర్టు శుక్రవారం నాడు వెల్లడించింది. రాష్ట్రంలో బీఫ్‌పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

అయితే మహారాష్ట్ర బయట నుంచి తెచ్చుకుని బీఫ్‌ తినొచ్చని అది చట్టవిరుద్ధం కాదని తెలిపింది. మహారాష్ట్రలో గత ఏడాది ప్రభుత్వం బీఫ్ పైన పూర్తి నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమిస్తే అయిదేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తారు.

Can Eat Or Keep Beef Brought From Outside Maharashtra, Says Bombay High Court

బీఫ్‌ పూర్తి నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు పైవిధంగా స్పందించింది.

ముంబై లాంటి మెట్రోపాలిటన్‌ నగరంలో భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు ఉంటారని, అలాంటి చోట బీఫ్‌ నిషేధించడం సరికాదని ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ నిషేధం ప్రజల ప్రాథమిక హక్కులను అతిక్రమిస్తోందని మరో పిటిషన్‌ దాఖలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+