వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరు: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

|
Google Oneindia TeluguNews

భోపాల్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింథియా గళం విప్పినప్పడు.. ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని.. ఇప్పుడు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ లాంటి నేతలు పూర్తి కాలం అధ్యక్షుడి నియామకం కోసం డిమాంట్ చేస్తుంటే వాళ్లను కూడా అలానే ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పై రోజు రోజుకీ విశ్వాసం సన్నగిల్లిపోతోందని ఆయన అన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అధ్యక్ష నుంచి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. చాలా మంది నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారని, పార్టీలో నాయకత్వం లేనందువల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంతోపాటు అస్తిత్వ సంక్షోభం ఎదుర్కొంటోందని అన్నారు.

Cant Save Such A Party: Shivraj Singh Chouhan On Congress Row

మరో బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ అస్తిత్వం సంక్షోభంలో పడిందని.. వారి రాజకీయ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, అందువల్ల ఏ పదవిలో ఎవరు ఉంటారనేది ఇప్పుడు కష్టమేనని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో.. మరోసారి సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని మెజార్టీ నేతలు కోరారు. దీంతో ఆమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా కొనసాగుతున్నారు. పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కొందరు సీనియర్ నేతలు డిమాండ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత రాహుల్ గాంధీ పదునైన పదజాలంతో విరుచుకుపడటంతో వారంతా వెనక్కి తగ్గారు.

English summary
As the Congress lurched deeper into crisis on Monday afternoon, divided over an explosive letter written by more than 20 veteran leaders targeting the Gandhi family's management of the party and calling for "a full-time, visible leadership", senior BJP figures took potshots at the opposition party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X