భారత్‌పై కెనడా అక్కసు: జైశంకర్ ఇంటర్వ్యూ ప్రసారం చేసిన ఆస్ట్రేలియా టుడేపై బ్యాన్

భారత్‌పై మరోసారి తన అక్కనును వెళ్లగక్కింది కెనడా. ఆస్ట్రేలియాలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) ఇంటర్వ్యూను ప్రసారం చేసిన అక్కడి ఓ మీడియా సంస్థపై కెనడా నిషేధం విధించింది. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలో ఆలయంపై దాడి ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. ఖలిస్థానీ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న జస్టిన్ ట్రూడో సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

Canada bans Australia Today for airing Jaishankar s interview

దీనిపై స్పందించిన జైశంకర్.. కెనడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కెనడా తీరు గురించి మడు విషయాలు మాట్లాడారు. మొదటిది.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులపై ఆరోపణలు చేసే పద్ధతిని పాటిస్తూ వస్తోంది. రెండోది.. భారత దౌత్యవేత్తలపై కెనడా నిఘా పెట్టింది. ఈ తరహా చర్య ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు. ఇక, మూడోది... ప్రస్తుతం మనమంతా చూస్తున్నదే. అందుకు ఈ వీడియోనే (హిందూ ఆలయంపై దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు) సాక్ష్యం. ఇవన్నీ పరిగణలోి తీసుకుంటే.. అతివాద శక్తులకు రాజకీయాల్లో చటు కలిగిస్తున్నారనే విషయం అవగతమవుతోంది అని జైశంకర్ పేర్కొన్నారు.

ఈ సమావేశాన్ని ఆస్ట్రేలియా టూడే (Australia Today) ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ కెనడా సర్కారు ఆ మీడియా సంస్థపై నిషేధం విధించింది. కెనడా చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా మీడియాపై కెనడా చర్యలు ఆశ్చర్యం కలిగించాయని పేర్కొంది. గంటల వ్యవధిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించింది.

భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆ దేశానికి ఉన్న కపటనీతిని ఇది ఎత్తి చూపుతోందని కెనడాపై భారత్ మండిపడింది. కెనడా గురించి జైశంకర్ మాట్లాడిన వాస్తవాలను జీర్ణించుకోలేని ఆ దేశం ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. ఇటీవల హోంమంత్రి అమిత్ షాపై కెనడా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలతో మరింతగా క్షీణించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+