క్యాన్సర్ రోగులకు భారీ శుభవార్త.. ట్రీట్మెంట్ మరింత చీప్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..
క్యాన్సర్ అనగానే చాలామంది భయపడతారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. అయితే ఈ వ్యాధి బారిన పడిన పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం కోసం లక్షలు పోయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు క్యాన్సర్ రోగులకు భారీ శుభవార్త అందింది. వారి వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) తాజాగా 543 యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ పై ఎంఆర్పీ ధరలను సవరించింది. ఈ మేరకు తగ్గించిన కొత్త ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు NPPA తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయా ఫార్మా కంపెనీలు అక్టోబర్ 27 మంగళవారం వరకు పంపించిన సమాచారం ఆధారంగా ధరలను క్రోడీకరించి నిర్ణయించింది.
ఈ మేరకు క్యాన్సర్ రోగులు అధికంగా తీసుకునే ఆయా ఔషధాల ధరలు చూస్తే.. అనస్ట్రజోల్ వన్ ఎంజీ ట్యాబ్లెట్స్ ను అనర్జోల్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ 10 ట్యాబ్లెట్స్ షీట్ ధర గతంలో రూ. 695 గా ఉండగా నవంబర్ 1 నుంచి కేవలం రూ. 73 కే లభించనుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి చెందిన అజాసైటిన్ ఇంజెక్షన్ లో 100 ఎంజీ అజాసైటిడిన్ ఉంటుంది. దీని ధర రూ. 6,337 నుంచి రూ. 1,495 కు తగ్గించారు. అలాగే అబ్బోట్ హెల్త్ కేర్ కు చెందిన బెవాసిజుమాబ్ ఇంజెక్షన్ 4ఎంఎల్ వైరల్.. ధర రూ. 21,767 గా ఉండగా ఇప్పుడు దాని ధర కేవలం రూ. 5,930 కే లభించనుంది. అలాగే నాట్కో ఫార్మా కంపెనీకు చెందిన దసానట్ 20 ప్యాకెట్ లో 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ షీట్ ధర రూ. 2,812 గా ఉంది. అయితే ఇప్పుడు ఆ ధర రూ. 1,085 కు తగ్గింది. అలాగే ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ కు చెందిన దెబ్రూమాబ్ 60 ఎంజీ ఇంజెక్షన్ రూ.22,031 నుంచి రూ. 5,941 కు తగ్గింది.

అలాగే 21 ట్యాబ్లెట్స్ తో ఉన్న పల్బోరో కంపెనీ షీట్ ధర రూ. 40,421 నుంచి కేవలం రూ. 2,720 కే లభ్యం కానుంది. ఇక రోగులకు తక్కువ ధరకే క్యాన్సర్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ ఈ ఔషధాల ధరలను తగ్గించినట్లు స్పష్టం అవుతోంది. తగ్గిన క్యాన్సర్ మందుల ధరలతో పేద, మధ్య తరగతి రోగులకు మరింత సౌకర్యవంతంగా వైద్యం అందనుంది.












Click it and Unblock the Notifications
