తీవ్ర వాయుగుండంగా అర్నాబ్..! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ..!
నిన్న రాత్రి తీరం దాటిన అర్నాబ్ తుఫాన్ (Cyclone Arnab) క్రమంగా బలహీన పడుతోంది. మధ్యాహ్నం తుపానుగా బలహీనపడిన ఈ తుఫాన్.. రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని పలు జిలాల్లో వర్షాలు (heavy rain) కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రతలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టం నివారించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం సూచిస్తోంది.
అర్నాబ్ తుపాను వాయువ్య దిశగా కదులుతూ నిన్న తీరం దాటిన తర్వాత పలు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. దీంతో పలు చోట్ల భారీ వర్షాలతో పాటు పంట నష్టం, ఆస్తి నష్టం కూడా చోటు చేసుకున్నాయి. ఇది క్రమంగా బలహీనపడుతూ తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా మారింది. ఇది ఇవాళ రాత్రికి తీవ్ర వాయుగుండం గానూ, రేపు ఉదయానికి వాయుగుండం గానూ, ఆ తర్వాత అల్పపీడనంగానూ మారి పూర్తిగా బలహీనపడబోతోంది. ఈ క్రమంలో రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.

రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది. పొంగిపోర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరికలు చేస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యలకోసం అనకాపల్లి (3), కాకినాడ(3), కోనసీమ(4), తూర్పుగోదావరి (2), ఏలూరు (1) పశ్చిమగోదావరి(2), కృష్ణా (2), శ్రీకాకుళం(2), బాపట్ల(1), అల్లూరి(2), పోలవరం (2), మన్యం(1), ఎన్టీఆర్(1), విశాఖ (1) మొత్తంగా 16 ఎన్డీఆర్ఎఫ్ ,11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగానే జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు. వీటితో పాటుగా అగ్నిమాపక సిబ్బంది, పోలిసు బృందాలు స్థానికంగా చెట్లు తొలగింపు వంటి పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications
