Cancer Vaccine: గుడ్ న్యూస్.. 6 నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ వ్యాక్సిన్

Cancer Vaccine: మహిళల్లో క్యాన్సర్ చికిత్సకు ఐదు నుంచి ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు దీనికి అర్హులు అవుతారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు. టీకాపై పరిశోధన దాదాపు పూర్తి అయిందని.. పరీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. దేసంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని..కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుందన్నారు.

30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహించబడతాయని.. వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి "డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు " ఏర్పాటు చేయబడతాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వెల్లడించారు. "మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్ కు వ్యాక్సిన్ పై పరిశోధన దాదాపు పూర్తయింది. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇది 5 నుంచి 6 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. 9 నుంచి 16 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలు టీకాకు అర్హులు అవతారు"అని మంత్రి ప్రతాపరావు జాదవ్ చెప్పారు.

Cancer Vaccine for Women to be Coming in 6 Months Says Union Minister

ఈ టీకా ఏ క్యాన్సర్ లను ఎదుర్కొంటుందని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నోటి, గర్భాశయ క్యాన్సర్ లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని కేంద్ర మంత్రి ప్రతాపరావు జావ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఆయుష్ కేంద్రాలుగా మార్చడం గురించి మంత్రి అడగగా.. ఆస్పత్రులలో ఆయుష్ విభాగాలు ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను పొందవచ్చని అన్నారు. దేశంలో ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు 12,500 ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం పెంచుతోందని మంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+