అభ్యర్థి ఉన్నా... ప్రచారంలో పాల్గోనని వైనం... ! భర్త ఫోటోతో ప్రచారం చేసిన భార్య

ఎన్నికల ప్రచారం అంటే పెద్ద హడవుడి, హంగామా ..పార్టీ అభ్యర్థులు భారీ వాహానాల కాన్వాయ్ లు, బహిరంగసభలు ఉంటాయి. ఇందుకోసం పెద్ద ప్రచార ప్రణాళికలే రచిస్తారు నేతలు..అయితే ఇందులో అభ్యర్థి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కలసి ఓటును అభ్యర్థించాలనే పరిస్థితి ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని మాత్రం అభ్యర్థి ఫోటో పెట్టుకుని అతని భార్య ప్రచారం చేస్తోస్తున్న వింత పరిస్థితి నెలకొంది.

పశ్చిమ బెంగాల్ లోని బిష్ణ్రుపూర్ లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ నుండి సౌమిత్రా ఖాన్ పోటి చేస్తున్నాడు. ఆయన 2014 లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. కాగా ఎన్నికల నేపథ్యంలోనే గత జనవరిలో తృణముల్ కాంగ్రేస్ ను వీడీ బీజేపీలో చేరారు.దీంతో బీజేపీ అయన్ను మళ్ళి బిష్ణుపూర్ నుండే రంగంలోకి దింపింది బీజేపీ..

అయితే సౌమిత్రా ఖాన్ పై కొన్ని పాత కేసులు ఉన్నాయి. ఈకేసుల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ అయ్యాడు. దీంతో కోర్టు బెయిల్ పై వచ్చాడు. అయితే సౌమిత్రాకు బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు షరతులు విధించింది. అయన బంకూర జిల్లాలోకి అడుగుపెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రిం కోర్టుకు వెళ్లాడు.అక్కడ కూడ ఆయనకు చుక్కేదురు అయింది. కోల్‌కతా కోర్టు తీర్పును సుప్రిం కోర్టు సమర్థించింది.

Candidate barred from entering constituency, wife pitches in to campaign

ఈనేపథ్యంలోనే సౌమిత్రా ఖాన్ పోటి చేస్తున్న బిష్ణపూర్ లోక్ సభ నియోజకవర్గం పూర్తిగా బంకూర జిల్లాలో ఉంది. దీంతో అయిన కనీసం నామీనేషన్ కూడ వేయడానికి వీలులేని నేపథ్యంలోనే కోర్టునుండి నామినేషన్ కోసం అనుమతి తెచ్చుకున్నాడు. కాని ప్రచారానికి మాత్రం అనుమతివ్వలేదు. దీంతో సౌమిత్ర ఖాన్ భార్య సుజాత భర్త ఫోటో పెట్టుకుని పూర్తిగా ర్యాలీలు, బహిరంగ సభలో పాల్గోని ప్రచారం చేస్తోంది.

కాగా ఆరవ విడత ఎన్నికల్లో బిష్ణుపూర్ పార్లమెంట్ నియోజక వర్గానికి కూడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలోకి వెళ్లకుండానే పోలింగ్ జరగనుంది. మరి ఆయన భార్య చేసిన ప్రచారం ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+