'భూకంపాలను ముందే పసిగట్టలేం, ప్రపంచంలో ఎక్కడాలేదు'
న్యూఢిల్లీ: భూకంపాల గురించి ముందుగానే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి వరకు ఎక్కడా లేదని, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోకసభలో చెప్పారు.
ఇటీవల తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపానికి నేపాల్లో వాటిల్లిన నష్టం, మన దేశంలోను పలు రాష్ట్రాల్లో కనిపించిన ప్రకంపనలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోదని, భూకంపాలను ముందుగానే పసిగట్టే సాంకేతికత మాత్రం ఇంత వరకు ఎక్కడా లేదన్నారు.
టీవీ చానల్ పైన ఆరోపణలపై...

రాజ్యసభ సభ్యుల పరువు ప్రతిష్టలను దిగజార్చే తీరులో రాజ్యసభ టీవీ చానల్ గురించి నిరాధారామైన వార్తలు ప్రచురించిన ఒక అంగ్ల దినపత్రికతోపాటు ఒక చానల్‌పై సభాహక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించటానికి అనుమతి ఇవ్వవలసిందిగా రాజ్యసభలోని ప్రతిపక్షాలు సభాధిపతిని డిమాండ్ చేశాయి.
అయితే సభా హక్కుల తీర్మానాన్ని అనుమతించే ముందు ఆ వార్తను క్షుణ్ణంగా పరిశీలించి సభా నియమనిబంధనలకు లోబడి ఒక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ చైర్మన్ కురియన్ హామీ ఇచ్చారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజ్యసభ చానల్ గురించి పత్రికలో వచ్చిన వార్త గురించి తనకు పూర్తి సమాచారం లేదని, ఆ వార్తను అన్ని కోణాల్లో పరిశీలించి, సభాహక్కుల తీర్మానానికి వీలుందని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రాజ్యసభ టీవీపై ఇంతవరకూ 1700కోట్ల రూపాయలు ఖర్చయ్యాయనీ, ఈ ఖర్చుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు లేవదీసిందని ఒక అంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త నూటికి నూరు శాతం తప్పని రాజ్యసభ సభ్యులు తెలిపారు. రాజ్యసభ టీవీపై ఇంతవరకూ 137కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయిదన్నారు. అయితే, సభా హక్కుల తీర్మానాన్ని అనుమతిస్తే మీడియా స్వేచ్ఛను హరించినట్లవుతుందా చూసి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications