వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. తేయాకు తోటలో ఎగిరిపడ్డ కారు.. గజ్జుమన్న కార్మికులు..

|
Google Oneindia TeluguNews

రోడ్డు పక్కనో.. గ్రౌండ్‌లో వెహికిల్స్ రేస్ ఉంటాయి. బైక్ ఎగురుతాయి. కొందరు కార్లను కూడా లేపుతుంటారు. కానీ అదీ రేర్.. నిజ జీవితంలో తక్కువగా జరుగుతుంటాయి. సినిమాల్లో అయితే తప్పక ఉంటాయి. అయితే సదరు షూటింగ్ గురించి చుట్టుపక్కల వారికి సమాచారం ఉంటుంది. ఇన్ఫో ఇచ్చిన తర్వాత అలాంటి ఫీట్లు చేస్తుంటారు. కానీ అనుకోకుండా అలాంటి ఘటనలు జరిగితే.. అవును ఏం జరుగుతుందో చూడండి.

 తేయాకు తోటలో ఎగిరిపడ్డ కారు

తేయాకు తోటలో ఎగిరిపడ్డ కారు

తమిళనాడు కూనూర్​లోని తుటుర్​మట్టం ప్రాంతం. ఇక్కడ తేయాకు తోటల్లో కూలీలు పని చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఓ కారు గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. భారీ శబ్దంతో దొర్లుకుంటూ పక్కనున్న తోటలో పడింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో పరుగులు కూడా తీశారు. ఏం జరిగిందోనని అనుకున్నారు.

అందులో భాగమట

అందులో భాగమట

అయితే తర్వాత ఆరా తీస్తే విషయం తెలిసింది. ఇదీ సినిమాలో భాగం అని తెలిసి కూల్ అయ్యారు. 'కింగ్' నాగార్జున నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​లో భాగమని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు. కూనూర్​లో గత పది రోజుల నుంచి నాగార్జున సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగానే కారు ఎగిరి పడింది. కానీ అక్కడున్న వారికి మాత్రం.. ఆ సమయంలో విషయం తెలియదు. దీంతో వారు కంగారు పడ్డారు. వీడియో కూడా బయటకు వచ్చింది. కానీ తర్వాత విషయం తెలియడంతో రిలాక్స్ అయ్యారు.

స్టూడియోలో అయితే

స్టూడియోలో అయితే

సినిమాల్లో డూప్ నిజమే.. కానీ స్టూడియోలో చేస్తే ఓకే.. బయట జనం ఉన్న చోట చేయడంతో ఇబ్బంది. అక్కడున్న వారికి సమాచారం ఉంటే అలర్ట్ అయ్యేవారు. కానీ వారికి తెలియక.. ఆకాశం నుంచి ఏమీ ఊడి పడుతుందో అని అనుకున్నారు. విషయం తెలిసే వరకు అదే టెన్షన్‌తో ఉన్నారు. అప్పటివరకు అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. కానీ సినిమా షూటింగ్ అని తెలిసి.. అయ్యో ఇదేనా అనుకున్నారు. అంతా గుండె మీద చేయ్యి వేసుకుని రిలాక్స్ అయ్యారు. వాస్తవానికి అక్కడ షూటింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. అందులో భాగంగానే కారు ఎగిరి వచ్చి పడింది.

English summary
A car flew into air and falls in a tea garden. incident happened at tamilnadu coonoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X