Cartosat 3: నింగిలోకి కార్టోశాట్-3 ..అమెరికా నుంచి ప్రయోగించనున్న ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమవడంతో నిరుత్సాహ పడని భారత అంతరిక్షపరిశోధన సంస్థ రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3ని నింగిలోకి పంపనుంది ఇస్రో. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగిస్తున్న ఈ కార్టోశాట్-3 ఉపగ్రహం భారత్ నుంచి కాకుండా అమెరికా నుంచి ప్రయోగం నిర్వహించనుంది.
ఇస్రో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న పోలార్ శాటిలైల్ లాంచ్ వెహికల్-ఎక్స్‌ఎల్... కార్టోశాట్-3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను నవంబర్ 25 అమెరికాలోని లాంచ్ ప్యాడ్ నుంచి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. భారత కాలమాన ప్రకారం రాకెట్ ఉదయం 9గంటల 28 నిమిషాలకు టేకాఫ్ తీసుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

కార్టోశాట్ -3 ఉపగ్రహం మూడో తరంకు చెందిన అడ్వాన్స్‌డ్ శాటిలైట్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంటే ఫోటోలు అత్యంత స్పష్టంగా తీస్తుంది. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలో ఈ స్థాయి రిజల్యూషన్ లేదు. ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను కనుగొనేందుకు కార్టోశాట్-3 ఉపయోగపడుతుంది. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది.
కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇక ఇస్రో చెబుతున్న ప్రకారం అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. ఇవి పూర్తిగా వాణిజ్య అవసరాలకోసం రూపొందించిన శాటిలైట్లు. స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications