లోకసభ గొడవ: 21 మంది ఎంపి ఎంపీలపై కేసులు
ముజఫర్‌నగర్: భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీశారంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది పార్లమెంటు సభ్యులపై బీహార్ కేసులు నమోదయ్యాయి. బీహర్‌లోని ముజఫర్ నగర్‌లో శుక్రవారం ఆ కేసులు నమోదయ్యాయి. పార్లమెంటు సభ్యులపై రాజద్రోహం కేసుతో పాటు ఇతర కేసులను నమోదు చేశారు .
సెక్షన్ 504, 323, 124బి, 308, 120బి కింద్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ కోర్టులో స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు చేశారు లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభ గౌరవాన్ని కాపాడాల్సిన సభ్యులే గొడవ చేయడం, ఇతర సభ్యులపై పెప్పర్ స్ప్రే కొట్టడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు సభ్యుల ప్రవర్తనపై దినపత్రికల్లో వచ్చిన వార్తాకథనాలు తల దించుకునేలా ఉన్నాయని ఓజా అన్నారు. పార్లమెంటు ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై విచారణ మార్చి 7వ తేదీకి వాయిదా పడింది.
కాగా, గురువారంనాడు తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన సమయంలో అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే కొట్టారు.












Click it and Unblock the Notifications