శభాష్ చిన్ను: నాగుపాముకు అడ్డుగా నిలిచి, ఫ్యామిలీని కాపాడిన పిల్లి..
నాగుపాము అంటే ఎగిరి గంతేస్తాం.. ఎవరో ఒకరిద్దరూ సాహసం చేసి పట్టుకుంటారు.. లేదంటే చంపుతారు. కానీ ఓ పెంపుడు పిల్లి.. నాగుపాముకు ఎదురొడ్డి నిలిచింది. ఎదురుగా ఉండి.. కుటుంబాన్నే కాపాడింది. ఒడిశాలో ఈ ఘటన జరగగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పాములు పట్టేవారు వచ్చి.. నాగుపామును పట్టారు. తర్వాత సంచిలో తీసుకెళ్లి అడవీలో వదిలేశారు.
Recommended Video

నాగుపాము పడగ విప్పి
భీమసాంగిలో ఈ ఘటన జరిగింది. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ నాగుపాము వచ్చింది. పెరట్లోకి వస్తున్న ఆ విషసర్పాన్ని సంపత్ కుమార్ పెంపుడు పిల్లి చిన్ను గుర్తించింది. వెంటనే ఆ పామును అడ్డుకుంది. పిల్లిపై దాడి చేసేందుకు ఆ నాగు పడగ విప్పి ఉగ్రరూపం దాల్చింది. అయినా ఆ పిల్లి వెనుకంజ వేయలేదు. అలాగే ఎదురొడ్డి నిలిచింది.

కుక్క అరవడంతో
ఇంతలో అక్కడే ఉన్న ఓ కుక్క అరవడంతో సంపత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి చూశారు. బుసలు కొడుతూ తాచుపాము కనిపించింది. దాని ఎదురుగా ల్లి కనిపించింది. సంపత్ కుమార్ స్నేక్ వలంటీర్‌కు సమాచారం అందించాడు. ఆ స్నేక్ వలంటీర్ వచ్చేంతరకు నాగుపామును ఎటూ కదలనివ్వకుండా పిల్లి అక్కడే కూర్చుంది. ఇంతలో స్నేక్ వలంటీర్ వచ్చి చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. తర్వాత అటవీప్రాంతంలో వదిలేశాడు.

అడ్డుగా నిలిచిన పిల్లి
ఆ పెంపుడు పిల్లి చిన్ను స్థానికంగా ఓ హీరో అయింది. నాగుపాము ఎదురుగా నిలిచి తన విశ్వాసాన్ని చాటుకుంది. వాస్తవానికి శునకం అంటేనే విశ్వాసం అంటారు. కానీ ఈ సారి పిల్లి కూడా అత్యంత విశ్వాసంగా మలచుకుంది. అయితే నాగుపాము.. పిల్లిని కరిచిందేమోనని పరీక్షలు కూడా చేయించారు. ఎలాంటి కాటు పడలేదని తెలిసి లోలోన సంబరపడ్డారు.
వీడియో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు హ్యాట్సాప్ అంటున్నారు. ఆ చిన్ను కుటుంబానికే అండగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. విష సర్పం బారి నుంచి కుటుంబాన్నే కాపాడిందని పేర్కొన్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications