వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హనీప్రీత్, డేరాబాబా సెక్స్, నన్ను కాపలా, చంపేస్తామని బెదిరింపు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

హనీప్రీత్, డేరాబాబా సెక్స్ కి నేను కాపలా గుర్మీత్ గదిలోకి హనీప్రీత్ వెళ్తుంటే..| Oneindia Telugu

సిర్సా: డేరాబాబాపై హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. రామ్‌రహీమ్‌తో తన మాజీ భార్య హనీప్రీత్‌ శృంగారంలో మునిగితేలిపోవడాన్ని తాను చూశానని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. ఈ విషయం రామ్ రహీమ్‌కు తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు.

డేరాబాబా: రూ.1,495 కోట్ల ఆస్తులు, 504 బ్యాంకు ఖాతాలుడేరాబాబా: రూ.1,495 కోట్ల ఆస్తులు, 504 బ్యాంకు ఖాతాలు

డేరా బాబా ఇధ్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష కోర్టు విధించింది. ప్రస్తుతం డేరా బాబా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే డేరా సచ్ఛా సౌధలో రామ్ రహీమ్ సింగ్ దారుణాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి.

డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?డేరాబాబా: వారసుడిగా జస్మీత్ సింగ్, కాదు రామ్ రహీమ్ సింగ్, ఏం జరుగుతుంది?

డేరాబాబా తన ఆశ్రమంలో మరో ప్రపంచాన్ని నడిపించేవారని తేల్చారు పోలీసులు. సాధ్వీలతో పాటు, స్కూల్ విద్యార్థులపై డేరాబాబా లైంగిక వేధింపులకు పాల్పడేవారని తేలింది.

డేరాబాబా అకృత్యాలపై కొందరు మాజీ ఉద్యోగులు ఈ విషయాన్ని విచారణ అధికారులకు వివరించారు.

రామ్ రహీమ్ సింగ్ హనీప్రీత్ శృంగారంలో మునిగితేలేవారు

రామ్ రహీమ్ సింగ్ హనీప్రీత్ శృంగారంలో మునిగితేలేవారు

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ శృంగారంలో మునిగి తేలుతుండగా తాను చూశానని తెలిపారు. ఆ విషయం గుర్మీత్‌కు తెలియడంతో తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. శృంగారం కోసం రామ్ రహీమ్ పరితపించిపోయేవాడని విశ్వాస్ ఆరోపించారు.

హనీప్రీత్ గది బయట ఉండేవాణ్ణి

హనీప్రీత్ గది బయట ఉండేవాణ్ణి

గుర్మీత్ గదిలోకి హనీప్రీత్ వెళ్తుంటే తాను బయట కాపలాగా ఉండేవాడినని విశ్వాస్ గుప్తా చెప్పారు. పిల్లలు కావాలంటే తన వద్ద రాత్రంతా గడపాల్సిందేనని చెప్పేవాడని విశ్వాస్ ఆరోపించారు. తమను బిగ్‌బాస్ షోలా ఆడుకునేవాడని, పనిష్మెంట్లు కూడా అదే తరహాలో ఉండేవని విశ్వాస్ వివరించారు. 2011లో హనీప్రీత్‌తో రామ్ రహీమ్ సింగ్‌కు వివాహేతర సంబంధం ఉన్న విషయమై కోర్టుకు వెళ్ళినట్టు ఆయన చెప్పారు.

హనీప్రీత్ దత్తత చట్టపరంగా జరగలేదు

హనీప్రీత్ దత్తత చట్టపరంగా జరగలేదు

హనీప్రీత్‌ను రామ్ రహీమ్ సింగ్ దత్తత తీసుకొన్నట్టు చెప్పారని గుర్తుచేశారు.అయితే ఆమెను దత్తత తీసుకున్నానని చెబుతున్నా అది చట్టపరంగా జరగలేదన్నారు. ఆమె అతడి కుమార్తె కాదని తెలిపారు. దత్తత సమయంలో ప్రభుత్వ నిబంధనలను గుర్మీత్ పాటించలేదన్నారు.

డేరా బాబా వెంట ఆయుధాల పెట్టె

డేరా బాబా వెంట ఆయుధాల పెట్టె

రామ్ రహీమ్ సింగ్ తన గదిలో ఎప్పుడూ ఆయుధాల పెట్టె ఉండేదని చెప్పారు. ప్రయాణించే సమయంలో కూడ ఈ పెట్టెను రామ్ రహీమ్ సింగ్ కారులో ఈ పెట్టెను తీసుకెళ్ళేవారని విశ్వాస్ గుప్తా చెప్పారు. డేరా సచ్చా సౌధలోనే కాదు బయట కూడ రామ్ రహీమ్ సింగ్‌తో హనీప్రీత్ ఉండేవారని విశ్వాస్ గుప్తా చెప్పారు. వీరిద్దరూ కూడ ఏకాంతంగా గడిపేవారని ఓ సాధ్వీ కూడ చెప్పారని విశ్వాస్ గుప్తా చెప్పారు.

హనీప్రీత్ కోసం పోలీసుల గాలింపు

హనీప్రీత్ కోసం పోలీసుల గాలింపు

పోలీసులను తప్పించుకు తిరుగుతున్న హనీప్రీత్.. గుర్మీత్ స్వగ్రామమైన రాజస్థాన్‌లోని గురుసార్ మొదియా, హనుమాన్ గఢ్‌లలో సంచరిస్తున్నట్టు పోలీసులకు ఉప్పు అందడంతో పోలీసులు శుక్రవారం నాలుగు గంటలపాటు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. డేరాబాబా ఇంటితోపాటు హనుమాన్ గడ్, శ్రీగంగానగర్‌లలోని పాఠశాలలు, మరికొన్ని ప్రదేశాల్లో పోలీసులు దాడులు చేశారు. గుర్మీత్ సింగ్ అరెస్టు అనంతరం హనీప్రీత్ గత నెల 28వతేదీన హనుమాన్ గఢ్‌ను సందర్శించినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బలగాలు హనీప్రీత్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఆమె జాడ మాత్రం లభించడం లేదు.

English summary
Honeypreet former husband vishwas gupta sensational comments on Ram rahim singh.He claimed that Honeypreet wasn’t Ram Rahim’s adopted daughter and no legal adoption process had taken place. He also said that the godman was sleeping with his ex-wife Honeypreet. He said that he caught her nude with Gurmeet Ram Rahim, who threatened him and told him not to tell anyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X