ఏడాది బిడ్డని గాల్లోకి విసిరి, కింద పడేసి.. తల్లి కర్కశత్వం (వీడియో)

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త పైన కోపంతో ఓ మహిళ తన ఏడాది వయస్సున్న కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా కొట్టింది. ఒకటి రెండుసార్లు కాదు... ఇలా ఆమె ఎన్నోసార్లు చేసింది.

భార్య తన కొడుకును చితక్కొడుతుందని తెలిసిన ఆ భర్త ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆమె దారుణాన్ని బట్టబయలు చేశాడు. భార్యభర్తల మధ్య గొడవకు ఆమె చిన్నారిని కొట్టడం గమనార్హం.

ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో చోటు చేసుకుంది. ఆ తల్లి నిత్యం తన ఏడాది కొడుకును చితకబాదేది. అంతేకాదు, అతనిని పిసికి హింసించేది. కొన్నిసార్లు భర్త ఎదుటే ఆమె కొట్టింది. అతను చిన్నారిని కొట్టవద్దని బతిమాలినా ఊరుకునేది కాదు.

తన భార్య తన కొడుకును కొడుతున్నట్లుగా తనకు అనుమానం వచ్చిందని, దీంతో తాను సీసీటీవీలు పెట్టానని ఆ భర్త చెప్పాడు.

ఓ ఫుటేజీలో ఆ మహిళ ఏడుస్తున్న తన బాబును వేధించింది. అతను ఏడుస్తున్నప్పటికీ ఆమె కొట్టడం మాత్రం ఆపలేదు. అంతేకాదు అతను ఏడుపు ఆపడం లేదనే కోపంతో పిసికింది. ఆ బాలుడిని గాలిలోకి విసిరింది. ఆ తర్వాత మంచం మీదకు విసిరేసింది. కర్కశంగా ప్రవర్తించింది. తన కొడుకును ఆమె చంపేస్తుందని, తనకు అప్పగించాలని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+