అమ్మాయిల ఎదుటే ప్యాంట్ విప్పి అసభ్యంగా, చితకబాదిన విద్యార్ధినులు

భోపాల్: విద్యార్ధినుల కోచింగ్ సెంటర్ వద్ద అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడికి యువతులు బుద్ది చెప్పారు. నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండి వద్ద ఓ కోచింగ్ సెంటర్ వద్ద ఓ యువకుడు కాపు కాశాడు. కోచింగ్ సెంటర్ నుండి విద్యార్ధినులు బయటకు రాగానే ప్యాంట్ విప్పేసి అసభ్యంగా ప్రవర్దించేవాడు. పోన్ మాట్లాడుతూనే ఈ వికృత చేష్టలకు పాల్పడేవాడు.

Caught on CCTV: Man flashes outside coaching centre in Bhind, girls thrash him

తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు వీలుగా ఆ నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకోనేవాడు. మొదటి రోజు ఆ నిందితుడు ఇలా చేయడంతో విద్యార్ధినులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే రెండో రోజు కూడ అక్కడే కాపు కాసి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్ధినులు నిందితుడిని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారామిచ్చారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు రెండు రోజులుగా కోచింగ్ సెంటర్ వద్ద ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సీసీ దృశ్యాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+