మహిళా డాక్టర్ దారుణం: ఐసీయులోనే తండ్రిని చంపేందుకు..

చెన్నై: ఆస్తి కోసం ఓ మహిళా డాక్టర్ కన్న తండ్రిని చంపేందుకు కూడా వెనుకాడలేదు. ప్రాణాలు పోయాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. డబ్బు కోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రికి ఉన్న వైద్య పరికరాలను తొలగించడం ద్వారా చంపేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటన జరిగింది సదరు మహిళా డాక్టర్ సోదరుడి ఆసుపత్రిలో. ఆ సోదరుడు సీసీ కెమెరాలో తన సోదరి చేసిన దుర్మార్గాన్ని గుర్తించాడు. ఈ సంఘటన గత ఏడాది సెప్టెంబర్ నెలలో చోటు చేసుకుంది. ఆ తర్వాత రెండు నెలలకు ఆ తండ్రి మృతి చెందాడు.

జయసుధ అనే ఆ మహిళా డాక్టర్. ఆస్తికోసం తండ్రిని చంపేందుకు కూడా వెనుకాడలేదు. ఆ వృద్ధుడి కూతురు జయసుధ, కొడుకు జయప్రకాశ్ డాక్టర్లు. వీరు వేర్వేరు చోటల ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ జయప్రకాశ్.. తన తండ్రికి తన ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

తండ్రిని చంపాలనుకున్న తనయ

తండ్రిని చంపాలనుకున్న తనయ

ఆ సమయంలో మరోచోట ఆసుపత్రి నిర్వహిస్తున్న సోదరి జయసుధ.. తన సోదరుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు వచ్చింది. ఐసీయులో ఉన్న నర్సులను, ఇతరులను బయటకు పంపించింది. ఆస్తులకు సంబంధించిన కాగితాలపై బలవంతంగా తండ్రి చేత సంతకాలు, వేలిముద్రలు తీసుకుంది.

తండ్రిని చంపాలనుకున్న తనయ

తండ్రిని చంపాలనుకున్న తనయ

అనంతరం ఇంట్రావీనస్ డ్రిప్ ఇంజెక్టింగ్ మెడిసిన్లు అందకుండా చేసింది. అయితే, ఆసుపత్రిలోని వైద్యులు ఆ తండ్రి కొనఊపిరితో కొట్టుకోవడం చూసి వెంటనే వైద్య సేవలు అందించారు. అతను ఆ తర్వాత రెండు నెలలకు మృతి చెందాడు. అనంతరం, ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఈ దృశ్యాలను చూసిన తర్వాత డాక్టర్ ఆర్ జయప్రకాశ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన సోదరి అయిన డాక్టర్ జయసుధపై హత్యాయత్నం, బెదిరింపు అభియోగాలపై కేసు నమోదు చేశారు.

తండ్రిని చంపాలనుకున్న తనయ

తండ్రిని చంపాలనుకున్న తనయ

జయసుధ ఒకరోజు తన ఇద్దరు కొడుకులతో ఆసుపత్రికి వచ్చి.. తాము ఏకాంతంగా ఉండాలంటూ అక్కడున్న ముగ్గురు నర్సులను పంపించినట్లుగా ఆ ఫుటేజీలో ఉంది.

తండ్రిని చంపాలనుకున్న తనయ

అనంతరం ఆమె కొడుకొకరు తన షర్టు కింద నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసిచ్చాడు. ఆమె తన తండ్రితో బలవంతంగా సంతకం చేయించుకుంది. అలాగే వేలిముద్రలు కూడా తీసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. ఆ తర్వాత ఐవీ లైన్ల నుంచి ప్రాణాధార మందులందకుండా ట్యూబులను మూసేసింది. ఈ ఉదంతంపై ఆమె సోదరుడు పోలీసులతోపాటు భారత వైద్య మండలికి కూడా ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+