అంకుల్ పట్టుకున్నాడని ప్రేమజంట ఆత్మహత్య

బాపుధాం కాలనీలోని సెక్టర్ 26లో నివాసముంటున్న అశోక్(17), మణిమంజ్రకు చెందిన పూజలు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. కాగా వారు ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ రాసిపెట్టారు. తామిద్దరం కలిసి ఉన్న సమయంలో తన మామచే పట్టుబడ్డామని, అందుకే అవమానంగా భావించిన తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని వారు ఆ నోట్‌లో పేర్కొన్నారు.
ప్రత్యక్ష సాక్షి గగన్ సింగ్ బ్రార్ కథనం ప్రకారం.. వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తమ ఇంటి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటలకు వెళ్లిన తన కుమారుడు అశోక్ తిరిగిరాలేదని తండ్రి మంగూ రామ్ వాపోయారు. అశోక్‌కు బాలికతో సంబంధం గురించి తమకు తెలుసునని ఆయన తెలిపారు.
అశోక్, పూజలు కలిసి ఉన్న సమయంలో పూజ మామ వారిని పట్టుకోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు వారి సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందని మణిమంజ్ర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ధర్మపాల్ సింగ్ చెప్పారు. పంఛ్కులలోని జనరల్ ఆస్పత్రి మార్చూరీకి మృతదేహాలను తరలించినట్లు ఆయన తెలిపారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా ప్రభుత్వ రైల్వే పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications