రామేశ్వరంలో దాడి: బెంగళూరులో ఇలా గొడవలు
బెంగళూరు: రామేశ్వరంలో కన్నడిగుల మీద దాడి చెయ్యడం వలనే బెంగళూరు నగరంలో హింస చోటు చేసుకుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన కన్నడిగుల మీద దాడి చేశారని ఓ ప్రయివేటు టీవీ చానల్ లో వార్తలు రావడంతో బెంగళూరు అట్టుడికిపోయింది.
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వాహనాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు చెందిన అనేక దుకాణాలు, హోటల్స్ ధ్వంసం చేశారు.

సోమవారం ఉదయం 10 గంటలకు రామేశ్వరంలో కన్నడిగులపై మొదటి దాడి.
* ఉదయం 10 గంటలకు రామేశ్వరంలో కన్నడిగులపై దాడి. ప్రయివేటు టీవీ చానల్ లో వార్తలు ప్రసారం చేశారు.
* ఉదయం 10.05 గంటలకు కన్నడిగులపై దాడిని ఖండిస్తూ బెంగళూరులోని కంటోన్మెంట్ సమీపంలోని ట్యానరీ రోడ్డులో ఆందోళనలు, దుకాణాల మీద రాళ్ల వర్షం.
* ఉదయం 10.15 గంటలకు విజయనగర, మైసూరు రోడ్డులోని స్యాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర ఆందోళనలు.
* ఉదయం 10.30 గంటలకు స్యాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర తమిళనాడు బస్సుల మీద రాళ్ల వర్షం.
* ఉదయం 10.40 గంటలకు నైస్ రోడ్డులో కన్నడ సంఘాల ఆందోళనలు, 10 తమిళనాడు వాహనాలకు నిప్పటించారు.
* ఉదయం 11 గంటలకు మైసూరు బ్యాంక్ సర్కిల్, ధణిసంద్రలో కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.
* మద్యాహ్నం 12 గంటలకు కావేరీ నదీ జలాల పంపణి విషయంలో సుప్రీం కోర్టు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.
* మద్యాహ్నం 12.15 గంటలకు మైసూరు రోడ్డులోని స్యాటిలైట్ బస్ స్టాండ్, నాయండనహళ్ళి, ఎలక్ట్రానిక్ సిటి ప్రాంతాల్లో తమిళనాడు లారీలకు నిప్పటించారు.
* మద్యాహ్నం 12.30 గంటలకు విద్యా సంస్థలు, దుకాణాలు, మాల్స్ బంద్.
* మద్యాహ్నం 1 గంటకు నాయండనహళ్లిలో నాలుగు తమిళనాడు లారీలకు నిప్పంటించారు.
* మద్యాహ్నం 2.30 గంటలకు చామరాజపేటలోని గోకుల్ రాజ్ కంపెనీ లారీలు ధ్వంసం.
* మద్యాహ్నం 3 గంటలకు స్యాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర ఆందోళనకారులపై నాలుగు సార్లు లాఠీచార్జ్.
* సాయంత్రం 5 గంటలకు గోకుల్ రాజ్ కంపెనీకి చెందిన 25 లారీలకు నిప్పటించారు.
* సాయంత్రం 6,15 గంటలకు రాజగోపాల్ నగరలోని తమిళ ప్రజలకు చెందిన షాపులు ధ్వంసం.
* సాయంత్రం 6.30 గంటలకు పోలీసు వాహనాలు, బీఎంటీసీ బస్సులకు నిప్పంటించారు.
* రాత్రి 7 గంటలకు సుంకదకట్టలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురికి తీవ్రగాయాలు.
* రాత్రి 8 గంటలకు రాజ్ కుమార్ సమాధి సమీనంలో అగ్నిమాపక శాఖ వాహనానికి నిప్పటించారు.
* రాత్రి 8,30 గంటలకు మహాలక్ష్మి లేఔట్ లో తమిళనాడుకు చెందిన కారు భూడిద.
* రాత్రి 9 గంటలకు విజయనగరలోని సీఎం లేఔట్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. సిద్దరామయ్య కటౌట్, దిష్టిబోమ్మలు దగ్దం చేశారు.
* రాత్రి 10 గంటలకు తుమకూరు రోడ్డులో వాహనాలకు నిప్పు పెట్టారు.
* రాత్రి 11 గంటలకు బెంగళూరు నగరంలో 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రామేశ్వరంలో కన్నడిగుల మీద దాడి చెయ్యడం వలనే బెంగళూరు నగరంలో హింస చోటు చేసుకుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన కన్నడిగుల మీద దాడి చేశారని ఓ ప్రయివేటు టీవీ చానల్ లో వార్తలు రావడంతో బెంగళూరు అట్టుడికిపోయింది.బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వాహనాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు చెందిన అనేక దుకాణాలు, హోటల్స్ ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications