కర్ణాటక సంచలన నిర్ణయం: ఎటుదారి తీస్తుందో
బెంగళూరు: కర్ణాటక శాసన సభ్యులు( అఖిల పక్షం) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కావేరీ జలాలు ఎట్టి పరిస్థితిలో తమిళనాడుకు విడుదల చెయ్యరాదని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కావేరీ నీరు కేవలం తాగునీటి కోసం ఉపయోగించాలని నిర్ణయించారు.
తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని గత మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కావేరీ జలాశయాల్లో నీటిమట్టం పడిపోయిందని గుర్తించిన ప్రభుత్వం అత్యవసర ఉభయ సభల సమావేశం నిర్వహించి చర్చించింది.
ఈ ఉభయ సభల సమావేశంలో కావేరీ జలాలు కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని అఖిలపక్ష శాసన సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ విషయంపై న్యాయపోరాటం చెయ్యడానికి అందరూ సిద్దంగా ఉండాలని తీర్మానించారు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయన్నది న్యాయనిపుణుల్లో ఉత్కంఠగా మారింది. కావేరీ జలాలు విడుదల చెయ్యరాదని తీసుకున్న నిర్ణయంతో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే అఖిలపక్షాలతో చర్చించి అందరిని ఒప్పించి చివరికి ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications
