సందేహాలకు చెక్: ‘జీఎస్టీ’ ఆండ్రాయిడ్ యాప్ ఇదే
వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆందోళన చెందుతున్న చాలా మంది వినియోగదారులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జీఎస్‌టీ రేట్లపై ఉన్న వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం మొబైల్ .
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆందోళన చెందుతున్న చాలా మంది వినియోగదారులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జీఎస్‌టీ రేట్లపై ఉన్న వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం మొబైల్ యాప్‌ను శనివారం ప్రారంభించింది.
'జీఎస్‌టీ రేట్ ఫైండర్' పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఈ మొబైల్ యాప్‌ను తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు.

అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ ఈ యాప్ పని చేస్తుండటం గమనార్హం.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications