హనీ.. హనీ.., కలవరిస్తున్న డేరాబాబా, మసాజ్ కోసమేనట, ఓరి వీడి దుంపతెగ!
దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ ను తనతో పాటు జైల్లో ఉంచాలంటూ గుర్మీత్ రాం రహీం సింగ్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు మొరపెట్టుకోగా కోర్టు డేరాబాబా అప్పీలను తిరస్కరించిందట.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అలియాస్ డేరా బాబా . . బాబా ముసుగులో ఎన్నో అక్రమాలు, దారుణాలకు పాల్పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు.
సొంత సామ్రాజ్యం, సకల సౌఖ్యాలు, 'పితా గుఫా' పేరుతో ఖరీదైన పడకలపై రాసక్రీడలు. ఇలా ఒకటేమిటి... ఎన్నో దారుణాలకు పాల్పడిన గుర్మీత్ సింగ్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.
తొలి రెండు రోజులు కన్నీరు మున్నీరైన డేరా బాబా ఇప్పుడు జైలు గోడలతో మాట్లాడుకుని సేదదీరుతున్నాడు. జైలు గదిలో దోమల బాధట. దీంతో 88 అడుగుల ఆ గదిలో ఓ మూల నక్కాడు ఈ గుంట నక్క.

నవ్వు తెప్పించే విషయం ఏమిటంటే.. దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ ను తనతో పాటు జైల్లో ఉంచాలంటూ గుర్మీత్ రాం రహీం సింగ్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు మొరపెట్టుకున్నాడు.
హనీ తన ఫిజియోథెరపిస్టు అని, తనకు బాడీ పెయిన్స్ ఉన్నందువల్ల మసాజ్ చేసేందుకు వీలుగా ఆమెను జైల్లో తనతో పాటు ఉంచాలని అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
అయితే డేరాబాబా అప్పీల్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. డేరాబాబాను జైలు నుంచి విడిపించేందుకు హనీప్రీత్ కుట్రపన్నినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో పోలీసులు ఆమె కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఇంతకాలం ఒక రాజులా బతికిన డేరాబాబాకు ఉన్నట్లుండి బిచ్చగాడి బతుకు వచ్చేసింది. పక్కన హనీప్రీత్ లేక ఆయనగారికి పిచ్చెక్కి పోతోందట. దీంతో ఏం చేయాలో తెలియక ప్రస్తుతం బాబా జైలు గోడలతో తన గోడు వెళ్లబోసుకుంటున్నాడట!
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications