చిదంబరం అరెస్ట్‌...సీబీఐ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు.. రాత్రంతా కార్యాలయంలోనే....

కేంద్రమాజీ మంత్రి పీ.చిదంబరం అరెస్ట్ అయ్యాడు. పార్టీ కార్యాలయం నుండి నేరుగా ఇంటికి చేరుకున్న చిదంబరం ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు... అంతకుముందు చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటికి వెళ్లిన అధికారులను ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి అనుమతించలేదు... దీంతో వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. అయితే చాల సేపటివరకు చిదంబరం ఇంట్లోకి వెళ్లలేక పోయారు.

CBI formally arrests P Chidambaram.

దీంతో ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదన్నట్టుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు....అయితే సీబీఐతో పాటు చిదంబరం ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మాత్రం వెనక్కి మళ్లారు..కాని సిబిఐ మాత్రం ఇంటి అవరణలోనే వేచి ఉండి ఆయనతో మాట్లాడిన తర్వాత అదుపులోకి తీసుకుంది.అనంతరం సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. సీబీఐ కార్యాలయంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.. అనంతరం ఆయన అరెస్ట్‌ను అధికారికంగా ధృవికరించారు. కాగా రాత్రంతా సీబీఐ కేంద్రకార్యాలయంలోనే ఉంచనున్నారు. వీలైనంత వరకు ఆయన్ను విచారించన్న సీబీఐ, కాగా రేపు సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.

ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత గత 24 గంటలుగా కనిపించకుండా పోయిన చిదంబరం అకస్మాత్తుగా ఏఐసీసీ కార్యాలయాంలో ప్రత్యక్షమయ్యారు. అప్పటికే సీబీఐ,ఈడీ అధికారులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పార్టీ కార్యకర్తలు దర్యాప్తు అధికారులను అనుమతించకపోవడంతో కార్యాలయంలోపలకి వెళ్లలేక పోయారు. ఇక చిదంబరం మీడీయా సమావేశం ముగిసిన తర్వాత నేరుగా తన ఇంటికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+