10, 12 తరగతి సీబీఎస్ఈ విద్యార్థుల మార్కులు ఇలా..? ఎలా ఇస్తారంటే...
కరోనా వైరస్ వల్ల సీబీఎస్ఈ 10, 12 తరగతి మిగతా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో విద్యార్థులను ప్రమోట్ చేస్తామని, సీబీఎస్ఐ బోర్డు నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వారు గత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. మూడు సబ్జెక్టుల కన్నా ఎక్కువ పరీక్షలకు హాజరైన విద్యార్థులను.. 3 సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనిబరిచిన మార్కల సగటును తీసి.. మిగతా సబ్జెక్టులకు కూడా మార్కులు జమచేస్తామని తెలిపారు.
ఒకవేళ సదరు విద్యార్థి మూడు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు మాత్రమే రాస్తే.. రెండు పరీక్షల మార్కుల సగటును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే ఢిల్లీలో మాత్రమే విద్యార్థులు 1 లేదా రెండు సబ్జెక్టులు మాత్రమే రాశారని సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు. వారికి ఆ సబ్జెక్టు లేదా ఇంటర్నల్/ప్రాక్టికల్/ప్రాజెక్టు ఆధారంగా మార్కులు వేస్తామని పేర్కొన్నారు.

మార్కులు వేసేందుకు కూడా సౌలభ్యం లేకుంటే ప్రతిభ మెరగుపరుచుకునేందుకు ఆప్షనల్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఆ ఫలితాలను కూడా మిగతా విద్యార్థులతో కలిపి ప్రకటిస్తారు. మరోవైపు విద్యార్థుల మార్కుల జాబితాను సీబీఎస్ఈ ఇప్పటికే రూపొందించింది. దానిని శుక్రవారం సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
Recommended Video
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications